యునైటెడ్ స్టేట్స్‌లో మొట్టమొదటి యాంత్రిక అలారం గడియారాన్ని 1787లో న్యూ హాంప్‌షైర్‌లోని కాన్కార్డ్‌లో క్లాక్ తయారీదారు లెవి హచిన్స్ రూపొందించారు.
ఉదయం 4 గంటలకు మాత్రమే మోగే ఈ పరికరానికి పేటెంట్ కానీ మార్కెట్ కానీ లేదు. ఎందుకంటే హచిన్స్ ఆ నిర్దిష్ట గంటలో (అంటే పగలు నాలుగు గంటలకు మాత్రమే) మేల్కొనేలా మాత్రమే దీనిని రూపొందించాడు. ఎక్కువసేపు నిద్రపోవడం సరికాదని అతని మాట.
తన గడియారాలలో ఒక దానిలో "గేర్"ను చేర్చడం ద్వారా, అతను ఆ ఖచ్చితమైన సమయంలో గంట మోగించడంలో విజయం సాధించాడు.
అలారం గడియారం ప్రాధాన్యాన్ని రూపొందించడం కష్టతరమైనదిగా భావించినా హచిన్స్ విజయం సాధించాడు. ఈ ఆవిష్కరణ అతనికి మాత్రమే ఉపయోగకరంగా ఉండేది. ఎందుకంటే ఇది సమయ సర్దుబాట్లను అనుమతించలేదు. తన అలారం వల్ల తన సోదరుడికి కానీ ఇతర కుటుంబసభ్యులకు కానీ ఇబ్బంది పెట్టకూడదని భావించాడు.
మరోవైపు, ఈనాడు మనం ఉపయోగించే తొమ్మిది నిమిషాల స్నూజ్ బటన్ 1956లో జనరల్ ఎలక్ట్రిక్-టెలిక్రాన్‌తో ఉద్భవించింది. కొన్ని పరికరాల్లో విరామం సవరించగలిగినప్పటికీ, 10 నిమిషాల సెట్టింగ్‌ను అనుమతించని ప్రారంభ "అనలాగ్ గడియారాల" సాంకేతిక పరిమితుల కారణంగా ప్రామాణిక స్నూజ్ తొమ్మిది నిమిషాలుగానే ఉంది. ఈ ప్రమాణం నేటికీ కొనసాగుతోంది.
కాబట్టి, మీరు ఈమారు ఆ అలారం విన్నప్పుడు, దాని శబ్దం వెనుక ఉన్న చాతుర్యాన్ని గుర్తుంచుకోవాలి. మనం సమయానికి మేల్కొనడానికి వీలు కల్పించిన చరిత్రను గుర్తుంచుకోవాలి.
లెవీ హచిన్స్ మసాచుసెట్స్‌లోని హార్వర్డ్‌లో గోర్డాన్, హోలీ హచిన్స్ దంపతులకు 1761 ఆగస్టు 17న జన్మించాడు. 1775 ఏప్రిల్ నెలలో, అమెరికా విప్లవాత్మక యుద్ధంలో , అతను తన తండ్రి ఆధ్వర్యంలో ఫైఫర్‌గా పని చేశాడు. మసాచు సెట్స్‌లోని చార్లెస్ టౌన్ తగలబడటాన్ని ప్రత్యక్షంగా చూశాడు. 1775 సెప్టెంబరులో, అతను జనరల్ గ్రీన్ ఆధ్వర్యంలో కల్నల్ వార్నమ్ రెజిమెంట్‌లో కెప్టెన్ లూయిస్ దళంలో చేరాడు. అతను 1776 నాటి వసంతకాలంలో న్యూయార్క్‌కు చేరుకున్నాడు. అక్కడ అతను బ్రూక్లిన్‌లో నియమించారు.
తరువాత అతనిని రెడ్ హుక్‌కు పంపించారు. అక్కడ అతను 1777 సెప్టెంబరు వరకూ ఉన్నాడు.
ఆ తర్వాత అతను న్యూ హాంప్‌షైర్‌లోని కాంకర్డ్‌లోని తన కుటుంబానికి తిరిగి వచ్చాడు. అతను ఒక సంవత్సరం బైఫీల్డ్ అకాడమీకి, రెండు త్రైమాసికాలు ఆండోవర్‌లోని ఫిలిప్స్ అకాడమీకి హాజరయ్యాడు. ఆ తర్వాత అతను పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేశాడు. టెక్స్‌బరీ, పెంబ్రోక్, మసాచుసెట్స్‌లోని ఆష్‌బర్న్‌హామ్ పట్టణాలలో పాఠాలు చెప్పాడు.
1777 డిసెంబర్ 6న, హచిన్స్, అతని సోదరుడు అబెల్ సైమన్ విల్లార్డ్ వద్ద అప్రెంటిస్‌లుగా మారారు. మూడు సంవత్సరాల ఒప్పందం తర్వాత వారు గడియారాల మరమ్మతులలో మరో ఎనిమిది నెలల అప్రెంటిస్‌షిప్ పొందడానికి కనెక్టికట్‌లోని అబింగ్టన్‌కు వెళ్లారు. కొంతకాలం తర్వాత, ఈ ఇద్దరు సోదరులు మెయిన్ స్ట్రీట్‌లో దుకాణం ఏర్పాటు చేయడానికి న్యూ హాంప్‌షైర్‌లోని కాంకర్డ్‌కు తిరిగి వచ్చారు. 1787లో హచిన్స్ మొదటి అమెరికన్ అలారం గడియారాన్ని సృష్టించాడు. ఈ గడియారానికి అలారం ఉండేది. రోజులో ఒక్కసారి మాత్రమే మోగే ది. అదీనూ ఉదయం 4 గంటలకు.
1789 ఫిబ్రవరి 23న, లెవీ ఫోబ్ హనాఫోర్డ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి పది మంది పిల్లలు పుట్టారు. 19వ శతాబ్దం ప్రారంభంలో, వారు కాన్కార్డ్‌లోని సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ( క్వేకర్స్ ) ను స్థాపించారు. 1793లో లెవీ సోదరులు కలిసి ఒక పొలాన్ని కొనుగోలు చేశారు, అక్కడ వారు వ్యవసాయం చేసి గడియారాల తయారీని కొనసాగించారు. 1807లో, వారు తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవడంతో, హచిన్స్ తన వాటాగా ఆ పొలాన్ని పొందాడు. 1808లో అతను వెస్ట్ పారిష్ లేదా వెస్ట్ కాన్కార్డ్ విలేజ్‌లోని లాంగ్ పాండ్‌లో 70 ఎకరాల (28 హెక్టార్లు) విస్తీర్ణంలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. 1815లో, లెవీ ఒక పెద్ద భవనాన్ని నిర్మించి, వస్త్రాన్ని తయారు చేయడానికి ఐదు మగ్గాలను ఏర్పాటు చేశాడు. ఈ వ్యాపారం మూడు సంవత్సరాల పాటు కొనసాగింది. అనంతరం దానిని అమ్మేసాడు.. హచిన్స్ ఇత్తడి గడియారాలను నిర్మించడం, అలాగే దిక్సూచిలు, ఇతర చిన్న చిన్న పరికరాలను సర్వే చేయడం వంటివి 20 సంవత్సరాలు కొనసాగించాడు.
అతను 1855 జూన్ 13న కాన్కార్డ్‌లో మరణించాడు.
మొట్టమొదటి అలారం గడియారం: - - యామిజాల జగదీశ్
• T. VEDANTA SURY




addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి