పరమాత్ముని ఆనతితో
పుడమిపై జన్మించిన
మానవుని మనుగడకు
ఆధారం భగవద్గీత...!
జన్మానామ్ నరజన్మ దుర్లభం అన్నది వేదం
జీవిత సాఫల్యతకు సన్మార్గంలో నడచి
సదాచారమును పాటించి
సమయస్ఫూర్తి కలిగి
సమయాన్ని సద్వినియోగం చేసుకోమని
కష్ట సుఖాలలో, కలిమిలేములలో
ఒకే విధంగా ఉండి
కర్తవ్య నిర్వాహణ చేస్తే
విజయం నీ పరమవుతుందని
స్థితప్రజ్ఞతకు దర్పణమైన
మానవుని జీవితం
వసుదైకానికే ఆదర్శమన్నది భగవద్గీత..!
కర్మన్ధ్యేవాది కారస్తే
మాఫలేషు కదాచనాయని
శీతోష్ణ సుఖదుఃఖేషు
తథా మానవమానయో అని
శ్రీకృష్ణపరమాత్మ అర్జనునికి ఉపదేశించిన
భగవద్గీత సారం జీవనవేదం
జగతికే ప్రామాణికం...!
........................


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి