@ కవితంటే.....! :- కోరాడ నరసింహా రావు
కవితంటే....! 
   భాషా పాండిత్యమా...!?     పద బంధాల అందాలు... 
 ప్రాసల సొగసులు... 
   అలంకారాల ఆకర్షణలు
   అంగాంగ వర్ణనలు 
     అభూత కల్పనలు
    అస్పష్టత - సంక్లిష్టతలు
     ఇవేనా....?! 

కవితంటే....., 
   ఓ ఓదార్పు.... 
    ఓ భరోసా... 
  కలితంటే...., 
  ఓ ఉపసమనం... 
    ఓ ధైర్యం... 
   ఓ నమ్మకం...! 

కవితంటే...., 
 ఓ అయోమయం కాదు
   ఓ వేర్పాటు వాదం కాదు
    ఓ విబేధ జనితం కాదు
     
కవితంటే.... 
   ఓ సమైక్య సందేసం
   ఓ సహజీవన సౌందర్యం
   ఏకత్వ శ0ఖారావం 
  
కవిత్వంలో ... కవిత్వం 
 యే కాస్త ఉన్నా చాలు 
   సాహిత్యం మాత్రం... 
  ఖచ్చితంగా ఉండే తీరాలి

సాహిత్యం లేని కవిత్వం 
  ప్రాణము లేని ప్రేతాత్మ ! 
  కవిత్వ మంటే చైతన్యం
 కవిత్వమంటే .... 
    సమాజ ప్రాణ వాయువు....!! 
      ******

కామెంట్‌లు