తొట్టంబేడు:ఈ సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ నందు పనిచేస్తున్న ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యంను రాష్ట్ర పరిశోధన శిక్షణా మండలి (ఎస్.సి.ఇ.ఆర్.టి) రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ తరపున విద్యా అధ్యయన యాత్రకి సింగపూర్ కి పంపిస్తున్నట్టు విద్యాభవన్ విజయవాడ కార్యాలయం నుండి సమాచారాన్ని అందించారు.ఈ నెల 27 నుండి డిసెంబర్ 2 లో తేది వరకు వారం రోజులు సింగపూర్ లో విద్యా శాలలను సందర్శించి అక్కడి విద్యా సంస్కరణల స్థితిగతుల పై అధ్యయనం చేసి రాష్ట్ర విద్యా శాఖ కు ఒక నివేదికను ఇవ్వనున్నారు.సింగపూర్ అధ్యయన యాత్రకి ఆహ్వానం రావడం పట్ల బాలుఆనందాన్ని వ్యక్తం చేసారు.సహచర ఉపాధ్యా యులు,మరియు మండల విద్యాశాఖ బాలుకి అభినందనలు తెలిపారు.
సింగపూర్ విద్యా అధ్యయన యాత్రకు ఉపాధ్యాయుడు బాలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి