రంగా రంగా ఓ మా శ్రీరంగా
పండరిపురము పాండురంగా
మము బ్రోవగా నీవు రావంగా
మా జీవనమౌలే పావన గంగా !
!! రంగా రంగా మా శ్రీ !!
రంగా రంగా ఓ మా శ్రీరంగా
మా ఇంటిలో నీవు వుండంగా
భక్తితో హృదయం నిండంగా
పూజలు చేస్తాం బ్రహ్మాండంగా
పండరిపురమేరా నీ నివాసం
మా మదిలోనే నీ చిర నివాసం
చేసుకుని జీవిస్తున్నాము అంతా
మా కుండదులే ఇక ఏచీకు చింతా
రంగా రంగా ఓ మా శ్రీ రంగా
మా మదిలో నీవు నిండంగా
మాకు ఉండదుగా ఏ భయం
ఉంటుందిగా ఇక నీ అభయం
రంగా రంగా ఓ మా శ్రీ రంగా
పండరి పురమును ఏ లంగా
భక్తుల మదిలో నీవు స్థిరంగా
ఉండి ముక్తిని ఇస్తావ్ శీఘ్రంగా
చంద్రభాగ నది తీర పట్టణం
పండరీపురం ఆయే తక్షణం
వెలిశావుగా కృష్ణుడవై అందు
తెలిసే మేం చేరాం నీ పొందు !
సేవిస్తాం మేం హమేషా నిన్ను
భావిస్తాం మాదైవం నీవే నమ్ము
భక్తిప్రవాహమందు మముకమ్ము
దీవించుటకై ఇక వేగముగా రమ్ము!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి