రమేష్ హైదరాబాద్ నగరంలో ఒక సామాన్య ఆటో డ్రైవర్. కడు పేదరికం అతని ఇంట్లో శాశ్వతంగా నివసిస్తున్నా, అతని మనసు మాత్రం ఎంతో గొప్పది. అతనికి నిజాయితీ అంటే ప్రాణం. రోజంతా శ్రమించి, తన భార్య, ఇద్దరు పిల్లలను పోషించేందుకు కష్టపడేవాడు. అతని భార్య కొన్నాళ్లుగా జబ్బుతో బాధపడుతోంది, పిల్లల స్కూల్ ఫీజు కట్టేందుకు కూడా డబ్బుల్లేని పరిస్థితి. ఈ కష్టాలన్నీ రమేష్‌ను నిత్యం కుంగదీసేవి.
ఒక రోజు సాయంత్రం, రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీ యజమానిని విమానాశ్రయానికి దింపి తిరిగి వస్తున్నాడు. హోటల్ వద్ద ఆయన్ను దించి, ఆటోను రోడ్డు పక్కన ఆపి, వెనుక సీటు శుభ్రం చేస్తుండగా, అతని కళ్లు ఒక నల్లటి తోలు బ్యాగ్‌పై పడ్డాయి. బ్యాగ్‌ను తెరిచి చూస్తే రమేష్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అందులో కట్టలు కట్టలుగా లక్షల రూపాయల నగదు, కొన్ని అత్యంత విలువైన వ్యాపార పత్రాలు ఉన్నాయి.
ఆ చీకటి క్షణంలో, ఆ నగదును చూసి అతని కళ్ల ముందు పాత కష్టాలన్నీ కదలాడాయి. "ఈ డబ్బు నా కష్టాలన్నింటికీ ముగింపు పలుకుతుంది కదా? నా భార్య చికిత్స, పిల్లల చదువుకు ఇక భయం లేదు," అని బలమైన ఆలోచన మనసులో మెదిలింది. కానీ, వెంటనే అతని అంతరాత్మ గట్టిగా హెచ్చరించింది. "రమేష్! నీ నిజాయితీ నీకు దక్కిన అతి పెద్ద ఆస్తి. ఇతరుల సొమ్ము ఆశించకు," అని స్ఫురణకు వచ్చింది. అంతేకానీ, ఆ డబ్బు పోగొట్టుకున్న యజమాని ఎంత కష్టంలో ఉంటాడో అని ఒక్క క్షణం ఆలోచించాడు. చివరికి, ఆ డబ్బుపై ఆశ పడకుండా, దానిని తిరిగి అప్పగించాలనే నిశ్చయానికి వచ్చాడు.
రమేష్ వెంటనే బ్యాగులో యజమాని వివరాల కోసం వెతకగా, అందులో బిజినెస్ కార్డు దొరికింది. అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ చేసి, బ్యాగ్ ఆటోలో ఉందని, వచ్చి తీసుకెళ్లమని వినయంగా చెప్పాడు. మొదట యజమాని నమ్మలేకపోయాడు. "నిజంగానా? ఎవరు మీరు? అందులో డబ్బు ఉందా?" అని ఆందోళనగా అడిగాడు. "ఉంది సార్. ఒక్క రూపాయి కూడా తీయలేదు. మీరే వచ్చి చూసుకోండి," అని రమేష్ దృఢంగా బదులిచ్చాడు.
మరుసటి రోజు ఉదయం, ఆ కంపెనీ యజమాని స్వయంగా రమేష్‌ను కలవడానికి వచ్చారు. మొత్తం డబ్బు, పత్రాలు సురక్షితంగా ఉన్నాయని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. "రమేష్, ఈ రోజుల్లో ఇంత నిజాయితీ ఉన్న మనుషులను చూడటం చాలా అరుదు. నా ప్రాజెక్టు పత్రాలు దొరకకపోతే నా వ్యాపారం దెబ్బతినేది," అని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన రమేష్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. యజమాని రమేష్‌కి పెద్ద మొత్తంలో నగదును బహుమతిగా ఇచ్చి, వెంటనే తన కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారు. అంతేకాక, రమేష్ ఆటోనే తన కంపెనీ ఉద్యోగులందరికీ ఫిక్స్‌డ్‌గా ఉపయోగించాలని ఆదేశించారు. నిజాయితీకి దక్కిన గొప్ప గౌరవం అది. రమేష్ చిరునవ్వుతో ఆ గౌరవాన్ని స్వీకరించాడు. ఆ రోజు నుండి, రమేష్ జీవితం సుఖ సంతోషాలతో సాగింది. నిజాయితీకి మించిన ధనం లేదని లోకానికి తెలిసింది.
నిజాయితీ:- సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి