శిఖిపించము నీశిరస్సున మెరయ
శ్రావణ నీరద శ్యామల దేహా
అఖిలలోకములు మురియగ
బృందావనిలో వేణు గాన మధురిమలు పంచ వెలసితివా కృష్ణా!
అతిశ్రేష్టమైన,అతిపెద్దదైన,బృందావనం,
నీదు పద్మమువంటి పాదముల స్పర్శకు పులకించి,ప్రకృతి
ఒడలు గగర్పొడిచి ఆనందపారవశ్యమున,అఖిలమైన
అద్భుత నాట్య విన్యాసం,ఏమని
వర్ణిoతు మురళీ ధరా!
నీదు మురళీ ఎంతటి యోగము జేసెనో.
కాళింది వడ్డున వెదురు పొదలలో పుట్టి,నేడు నీదు అధరముల తాక అమృత ఝల్లులు కురుపింప ఎన్ని జన్మలపుణ్యమో,
ఎంత అదృష్టమో!గోవుమందలగాచు గోప బాలకులు నీ వేణుగానామృతం వీనుల తాకమైమరచి నిదుర పోయే!వృక్షములు తమపులకింతని పూమకరంద ఝరుల తెలియాడించిన తీరు అద్భుతం,
అనంతము,అమోఘము,
పురివిప్పిన మయూరాలు,
ఆ మధురామృతమును గ్రోలినచందమున మృదు కేకారవములతో మధుర మయూర నాట్య విన్యాసాలు,
నదీమతల్లి నాబిడ్డ గానం నాకే జోలగుచున్నదన్న ముదముతో అలలపై కమలముల పద విన్యాసం చూడ ముచ్చట.
సుందర సురతర సుధారస మురళీగానం.బృందావనం లో సర్వ జనుల,తరుల,గిరుల, మహదానందము,
తన్మయత్వం లోమునిగిన తరుణంలో మౌనహృదయాల అమృతస్పందన నీదు
పాదాక్రాంతమయ్యే
ఆనందభాష్పాల తో.....
మైమరపు:- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి