****
"అవ్వా! గిది నీకు యాదికుందా ?కొండయ్యన్న కొడ్కు" ఏరు బోత్తవా లేదా శేను శెల్క పంచుతవా లేదాని ఇంట్లె మస్తు శికాకు జేసి, పెద్దమడుసుల్లబడి పంచాతి సుత జేసిండు. గప్పుడు "కొండయ్యన్న బొందిల పానముండగ ఏరు బొయ్యను.ఉంటె ఉండు లేకుంటె దొబ్బైయ్" అని వదినె ఎంత ఆగబట్టినా ఆక్కుండ లాషి లాషిగ తిట్టిండు."
"అవుమల్ల! గా సంగతి మర్శేబోయిన.గిప్పుడు గదెందుకు యాదికొచ్చింది శెల్లె!"
"గదే మరి అమ్మ అయ్య మీద అలిగి గా రాతిర్కి రాతిరే పెళ్లాం మాటిని దాని కొంగు బట్టుకొని అత్తోరింటికి బోయిండు.గిక్కడేమో వదినె రంధి బెట్టుకొని మంచం నేస్తంది.అన్నేమో కిమ్మన్నాస్తిగుండు."
గిందుల కొత్తేముంది శెల్లె! ఊళ్ళె అందర్కి తెల్శిందె గద!"
ఓ అవ్వా! ఆగాగు గీ ముచ్చటింక ఒడ్వలె.పొయినోడు అక్కడే ఉండక ఆళ్ళు సరింగ అర్సుకోలేదని, అవుమానం జేసిండ్రని గరమై గా నించి శెల్లింటికి బోయిండట.గక్కడా సుక్కెదురైందట.బావ ఆడిని బట్కొని ముక్క శివాట్లు బెట్టిండట.ఇంగేముంది గిదంత నాయిన జేబట్టేనని వదినెకు పోన్ల జెప్పి "నాయిన రమ్మనక బోతె సత్త బత్కుతని" బెదిరిత్తుండంట.
గందుకే మరి "అలిగి అత్తింటికి -శెడి శెల్లింటికి బోవద్దని" మన పెద్దోళ్ళు ఊరికెనే అన్నారు. పోరడికి తిక్క గుదిరింది. మా బాగయ్యింది.ఇంగ జల్మల గట్టాంటి పని జెయ్యడు పో."
అంటున్న అవ్వతో "గిదేంది నీది కొండయ్యన్నది ఒక్కటే కుతికొతికె ఉంది. పొల్లు బోకుండ గిట్లనే అన్నడు."
"కత పురాగ ఐపోలె. గింతకీ గా పొల్ల ముచ్చటే మైంది. మొగుడెనకాల బడి అది సుత తిరగబట్టింద. బుద్దొచ్చి ఓ తాన నిల్కడగుందా?"
"ఓ అవ్వో! దీని గరువం సుత సొంట్లెకు దిగిందిలె.పుట్టింట్ల ఉన్నదేదో ఉండి మొగుణ్ణి జూస్కోక శెల్లింటికి బోయిందట.గాడ దీని మర్ది శెల్లె కాపురం శెడగొట్టనీకి వొచ్చిందని తల్లితో కల్సి సాటుమాటుగ ఇదేనేట్టు సూటిపోటి మాటల్ని యిసురుడట.ఇంగేముంది ఆరం దినాలక్కడ వుందమన్కున్నది మూడొద్దులకే గోడగ్గొట్టిన శెండోలె వచ్చిందంట.
ఇంగిక్కడ అత్తని మంచి జేస్కుందమంటే పుట్టింట్ల అల్గి గీడకొత్తె "కొడ్కుని గిన్నొద్దులు ఆగమాగం ,అవుమానం పాలు జేసిందని మా బాగ ఏకిందట."
"అయితే ఇద్దరాల్మొగలకు బాగనె బుద్దొచ్చిందన్న మాట. అమ్మ నాయిన ఎవలి కోసం కట్టపడ్తరన్న ఇంగితం ఉండొద్దు.అత్తొద్దు.మావొద్దు గని గాళ్ళు సంపాయించిందైతె గావాలె. "సరే తీ! ఇంగ అందరొక్క గూట్లె ఉన్రన్న మాట. రేపే ఎల్లి వదిన మొగంల సంబురాన్ని జూడాలె శెల్లె. గా మాటల్కి "గట్లనే అవ్వా !"అన్కుంట ఇంటి దారి బట్టింది.
గిదండీ సంగతి! ఆడైనా,మగైనా ఇట్ల "అలిగి అత్తింటికి -శెడి శెల్లింటికి బోవద్దని" అంటరు.ఎందుకో సమజైంది గద!"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి