శ్లో కం :
నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ ।
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 2
ఈ శ్లోకం తెలుగు భావం: "ఆనందమైన ఉత్సవాలతో ఉన్న, ప్రార్థించేవారి కోరికలను తీర్చే, నారాయణుడిచే పూజించబడిన పాదాలు కలిగిన శంకరుడు మరియు పార్వతికి నమస్కారం".
నమః శివాభ్యాం: శివుడు, పార్వతికి నమస్కారం.
సరసోత్సవాభ్యాం: ఆనందమైన ఉత్సవాలు చేసేవారు.
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్: ప్రార్థించేవారి కోరికలను వెంటనే నెరవేర్చేవారు.
నారాయణేనార్చితపాదుకాభ్యాం: నారాయణుడు (విష్ణువు) పాదాలను పూజించినవారు.
నమో నమః శంకరపార్వతీభ్యామ్: శంకరపార్వతులకు మళ్ళీ మళ్ళీ నమస్కారం.
********
శంకరాచార్య విరచిత - ఉమా మహేశ్వర స్త్రోత్రం :- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి