చిన్న చిన్న బొమ్మల్లోస్వప్నాల కాంతుల్లోపసిపెదాల నవ్వుల్లోవిరితోటలో కుసుమాలైవికసించే బాల్యమా నువ్వెక్కడ..?బడి గంటలు మ్రోగినాపుస్తకాల బుట్ట భుజాన వ్రేలాడనిఇటుక బట్టీల్లో ఎగిసే ఆకలిమంటల్లోఇరుక్కుపోయి కాలిపోయే కూలిపోయేబాల్యానికి బంగారు భవిష్యత్తెక్కడ..?కాలే కడుపులు నింపే"కాసిన్ని మెతుకుల" కోసంపెంటకుప్పల మీద పేపర్లేరుకొంటూవీధుల్లో తిరిగే బిక్షగాళ్ల బాల్యంలోచిరునవ్వుల పువ్వులు పూచేదెన్నడు..?చాక్లెట్ల మాయలో ముంచిమోసపు మాటలతో నమ్మించిఅంధకారపు లోయలో తోసేస్తున్నకళ్ళు పొరలు కమ్మిన కామపిశాచులవిషపుకోరల్లో చిక్కి విలవిలలాడేబంగారుజింకల కన్నీటి బిందువుల్నితుడిచే కరుణామయులెవరు...?అనుమానాల పొగమంచులోఅహంకారాల తుపానులో చిక్కిఅమ్మా నాన్నలిద్దరూ విడిపోతే…భరించలేని ఆ బాధ గాజుముక్కలాచిన్నిగుండెలకు గుచ్చుకుని బలైనఆ బాల్యానికి ఏ ఔషధం రాయాలి..?వీధిలో చెత్తకుండీల చెంతఎంగిలి మెతుకుల కోసంకుక్కలతో కుస్తీ పడుతూనిత్యం ఆకలికి అలమటించేఅస్థిపంజరాలను అక్కున చేర్చుకునేఅన్నదాతలెక్కడ ? అభయహస్తాలెక్కడ.?కలలకు బంగారురంగులద్దేది బాల్యంజీవితపు చిమ్మ చీకటినిచీల్చే చిరుదీపం బాల్యంఅట్టి బాల్యాన్ని రక్షిద్దాంబాల్యానికో వెలుగునిద్దాంఅదే మానవత అదే మన బాధ్యతఅదే మన నిజస్వరూపమని నిరూపిద్దాం.!
బాల్యం చిగురించేదెప్పుడు..?;- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి