శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ ఆలయ కమిటీ, పెద్దిన మెడికల్ క్లినిక్, శ్రీ షిరిడి సాయి ఆటో మొబైల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ఆద్యాత్మిక ప్రవచనాల ప్రసంగాలు నేటితో ముగిసాయని నిర్వాహకులు పెద్దిన కులశేఖర ఆల్వార్ తెలిపారు. మండల కేంద్రంలో గల సీతారామ ఆలయం ప్రాంగణంలో కార్తీక మాసపు ఆద్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా శ్రీశ్రీశ్రీ ఆభయాంజనేయ ఆలయాన ప్రతీరోజూ రాత్రి ప్రముఖ పండితులు తెలుగు భాషా ఉపాధ్యాయులు ముదిల శంకరరావు ఈ ప్రసంగం ప్రవచనాలను భక్తులకు వినిపించి ఆద్యాత్మిక భావాలను పెంపొందించారు. మహా భాగవతంలో భక్తప్రహ్లాద చరిత్రను ఆయన భక్తజనులకు రాగయుక్తంగా వినిపించి అవగాహన పర్చారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు కుదమ తిరుమలరావు, అల్లిన వెంకట రమణ మూర్తి దిలీప్ రాజా పట్నాయక్ లు హాజరై భక్తి గీతాలు పద్యాలను వినిపించారు. సభాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్ మాట్లాడుతూ దైవభక్తి కలిగియుండుట వలన మానవులంతా నైతికవిలువలను కలిగియుంటారని తద్వారా సమాజాభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రవచనకర్త ముదిల శంకరరావు మాట్లాడుతూ బాల్యంనుండే గుణాత్మక విలువలు, మంచి పౌరులుగా వెలుగొందే లక్షణాలతో పాటు పలు మానవీయతా విలువలున్న భక్త ప్రహ్లాద చరిత్రను సంపూర్ణంగా వివరించడం జరిగిందని అన్నారు. అనంతరం శంకరరావుకు పెద్దిన ప్రతిభా పురస్కారంగా శాలువా, ప్రత్యేక కానుకలు, నగదు పారితోషికాలతో ఘనంగా సన్మానించారు. అలాగే అతిథులుగా విచ్చేసిన కుదమ తిరుమలరావు, ఎవిఆర్ఎం దిలీప్ రాజా పట్నాయక్ లను నిర్వాహకులు పెద్దిన ప్రతిభా పురస్కారాలను శాలువా, ప్రత్యేక కానుకలు, నగదు పారితోషికాలతో ఘన సత్కారాలు గావించారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్, ఆలయ ధర్మకర్త పెద్దిన విశ్వనాథం, డా.పి.ప్రసన్నకుమార్, పి.యశస్వి, కొత్తూరు రచయితల వేదిక సభ్యులు వైశ్యరాజు హరనాథరాజు, పి.రామచంద్రరావు, ఉపాధ్యాయులు లంకవలస రమణయ్య, శ్రీదేవి, లీలారాణి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచార కార్యకర్త పొగిర రవి, కాంట్రాక్టర్ పి.అర్జున్, భక్తబృంద సభ్యులు అల్లు రాములు, వైశ్యరాజు నారాయణరావు, కుప్పిలి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి