సుప్రభాత కవిత : - బృంద
ఉదయరాగపు ఆలాపన
హృదయాన్ని తాకగా
అర్ణవమంత ఆనందంతో
వర్ణమయం అంబరం

రహదారి వెంట రథం 
ఏతెంచు పథంలో 
రమణీయంగా రంగవల్లులు 
తీర్చు మబ్బుల సంబరం

సస్యకేదారాల సల్లాపములతో
సంతోషము వెల్లువై
సరసాలు ఆడుతూ 
సందడిచేసే పైరగాలి

బాల భానుని ఆగమనముతో 
భావ గీతం పాడుకుంటూ
స్వాగతం పలుక సిద్దమాయే 
మగత వీడి మేదిని

కొండ కోనల జాలువారే 
జలపాతాల గీతికలు
ఆకులలో తిరిగే గాలుల
గలగలలు  అన్నీ వేదమంత్రాలు

అనుదిన అద్భుతం 
అలౌకిక ఆనందం 
అనుభవైక్యవేద్యం
ఆదిత్యాగమనా తరుణం 

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు