ఇట్టి జీవితమే కదా...! :- కోరాడ నరసింహా రావు
మధు మేహం.... 
     సకల రోగాల స్వాగత ద్వారం...! 
   మనిషి సర్వశక్తులూ నిర్వీర్యం !! 

గుండె పోటును జతగా తెచ్చును 
  అజీర్తి రోగము వెంట వచ్చును ! 

రాత్రి అతి మూత్రముతో ని ద్ర పట్టదు
   నోరు కట్టు కుని కూచో వాలి లేకుంటే 
   కిడ్నీల పని హ రీ...! 

తీపి,ఉప్పు,పులుపు,కారం
 రచునులన్నిటికీ స్వస్తీ 
    పని  సామర్ధ్యం నాస్తి..!

విరక్తి, వైరాగ్యం , జీవన మాధుర్యం సూన్యం ..! 

మధు మేహం వచ్చినాక బాధలు పడే కన్నా
    ఇది రాకుండా జాగ్రత పడటమే కదా మేలు..! 

సమయ పాలన అత్యవ సరము
    ఆహార, నిద్రల నియమ మవసరం...! 

ధూమ, మద్య పానము లకు దూరం
  మనసు నిర్మలము ముఖ్యము...! 

అతిఆలోచనలు,విచారము, దుఃఖములు
  విడనాడాలి తప్పని సరిగా...! 

మనసు నెపుడు ఉంచాలి
 ప్రశా0త , సంతోషముల ! 
  తగు వ్యాయామము , యోగాభ్యాసము  ఉపక రించును ఆరోగ్యమునకు

ఆరోగ్యమే మహా భాగ్యము
   ఇదియే యిచ్చును ఆనందము ..! 
   
సిరి, సంపదలకు ఇదె ఆధారము...! 
 ఇదియే జీవన సాఫల్యము..., 
   ఇట్టి జీవితమే క దా ధన్యము...!! 
       ******

కామెంట్‌లు