తెలుసుకో చెల్లీ....!! :- కోరాడ నరసింహా రావు.
ఆ తాపత్ర య మంతా... 
 నిన్ను పడేయ టానికే ! 
   నిన్ను పడేయ టానికే... 
   వాడి వెకిలి చేష్ఠలన్నీ...!! 

వాడి కుళ్లు జోకులకి... 
  వాడి వెర్రి వే షా ల కీ... 
    వాడి వలలో నువ్ పడి పోతె... 
    తరువాత నువ్వెంత ప్రయత్నించినా ఆ ఉచ్చు లోనుండి నువ్ బయట పడ లేవ్...! 
   నిన్నాకర్షించ టానికి.... 
వా డె న్ని చెయ్యాలో ... 
 అన్నీ చేస్తాడు...! 
    మంచి తనాన్ని మహా నటుడై పోయి నటిస్తాడు! 

నువ్వు వాడికి లొంగిపోయిన తరువాత నీకు చూపిస్తాడు వాడి విశ్వ రూ పా న్ని...!! 
   అప్పుడు నీ జీవితం... ఇక కుక్కలు చింపిన విస్త రో..., 
     కాక పోతే...చచ్చేదాకా చాపల మోతో..!! 
   ఇప్పుడే ఈ నవ్వులన్నీ... 
 తరువాత బ తు కం తా  ఏడుపే...! 
    తెలుసుకో చెల్లీ.... 
  మోసపోకు తల్లీ... 
   నయవంచకుల లోకమిది...! 
   ప్రేమ వ్యామోహంలో పడి... 
   పెద్దలను వీడీ.... 
 బ్రతుకంతా నరకం చేసుకోకు....!! 
      *****

కామెంట్‌లు