శుభోదయం!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
నిద్దుర స్వప్నం 
ఒక భయంకర సమస్య 
మేల్కొనడమే దానికి పరిష్కారం 
మేల్కొనడమే ప్రశ్నకు సమాధానం!!

మేల్కొని ముందుకు కదలడమే 
సమస్యకు పరిష్కారం 
మేల్కొనడమే జ్ఞానోదయం!!
నిద్దుర స్వప్నం నిజం 
మేల్కొనడం ఒక ప్రయత్నం!!!

తృష్ణ కాంక్ష 
ఒక భయంకర ఆలోచన 
మేల్కొనడమే దానికి పరిష్కారం 
ప్రయత్నమే ఆ ప్రశ్నకు సమాధానం!!

ధనం దుఃఖం ఒంటరితనం 
ఒక భయంకర సమస్య 
మేల్కొనడమే ఒక జ్ఞానోదయం!! 
ప్రయత్నమే ఆ ప్రశ్నకు సమాధానం!
అదే ఉదయం శుభోదయం.!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు