బ్రహ్మ కొడుకు స్వాయంభువ మనువు.ఆయన భార్య శతరూప కి ప్రియవ్రతుడు,ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు.ఉత్తానపాదుడి భార్య సునీతి కొడుకు భక్త ధ్రువుడు.చిన్న భార్య సురుచి కొడుకు ఉత్తముడు.తండ్రి ఒడిలోకి ఎక్కుతున్న ఐదేళ్ల చిన్నారి ధ్రువుని సవతితల్లి ఈసడిస్తే, తండ్రి నోరెత్తక పోటంతో ఏడుస్తూ అమ్మ దగ్గరకు వెల్తాడు."నాయనా! శ్రీమన్నారాయణునే సేవించు" అన్న ఆమె మాటలతో ఆచిన్నారి అడవికి తపస్సుచేయటానికి బైలుదేరాడు.నారదుడు కన్పడి యమునాతీరంలో మధువనంలో తపస్సు చేయి.ఓంనమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించాడు. నారదుడు సరాసరి ఉత్తానపాదుని దగ్గర కెళ్లి ఓదారుస్తాడు.ధ్రువుని భక్తికి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమైనాడు. "నీవు శాశ్వతమైన ధ్రువమండలంగా చిరస్థాయిగా ఉంటావు." అని వరం ఇస్తాడు.ధ్రువుడు తల్లిదండ్రులను చేరుకుంటారు.యవ్వనంలోకి అడుగుపెట్టిన ధ్రువునికి పట్టాభిషేకం చేసి ఉత్తానపాదుడు అడవికెళ్లిపోయాడు.ధ్రువుని భార్య భ్రమి కొడుకులు కల్పుడు వత్సరుడు తమ్ముడు ఉత్తముడు వేటకెళ్లి యక్షుని చేత చంపబడ్డాడు.ఆకోపంతో ధ్రువుడు యక్షులుండే హిమాలయాలుచేరిఅందర్నీ ఊచకోత కోశాడు.కొందరు అలకాపురికి పారిపోయారు.తాత స్వాయంభువమనువు వచ్చి" నాయనా! క్రోధం నరకానికి ద్వారం.కుబేరుని అనుచరుల్ని చంపకు" అని నచ్చజెప్పటంతో ధ్రువుడు శాంతించాడు.ధర్మంగాపాలనచేసి కొడుకు ఉత్కళునికి రాజ్యభారం అప్పగించి బదరికాశ్రమం చేరి సమాధిస్థితిలో ఉన్న ధ్రువుని దివ్యవిమానంలో నందసునందులు తీసుకుని వెల్తారు.తల్లి సునీతి అంతకుముందే విమానంలో విష్ణులోకానికి పయనమైంది.ధ్రువుడు సప్తర్షిమండలం పైనున్న వైకుంఠధామం చేరాడు.శ్రీహరికరుణతో ఐదేళ్ల కే బాలభక్తునిగా, అమ్మంటే ప్రేమ ఉన్న కొడుకుగా ,దీక్ష పట్టుదలకి కొమ్మ గా ధ్రువుడు నిలిచాడు🌷
ధ్రువుడు! - అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి