సుప్రభాత కవిత : - బృంద
నీ వెలుగులో నీడలు కూడా 
నివేదనలే....

నీ కరుణలో కలతలు వీడి
కధలు మారునే...

నీ రాకతో చీకటి ఏకంగా
నీలోనే కలసిపోయేనే!

నీ కిరణపు పదునుతో
జగతికి మేలుకొలుపులే!

నీ పగడపు శోభలు
పుడమికి పుత్తడి పూతలే!

నీ కాంతి పుంజాల మెరుపులో
కెంజాయలో మునిగె భువి!

నీ నులివెచ్చని  స్పర్శ
మేదినికి సకల రీతుల రక్ష!

నీమము తప్పని నీ గమనంతో
నడుచును లోకం సమస్తం.

అవనిపై నీ కరుణ
శివ శక్తుల ప్రతిరూపం!

ఆదరించి బ్రోవమని
అఖిలజగతి విన్నపం

తూర్పున నిన్ను చూచి
కైమోడ్చి నిలిచి వందనమిడుతూ

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు