శిలను శిల్పంగా మార్చాలంటే
ఉలి దెబ్బలు తప్పనిసరి
కలలు సాకారం కావాలంటే
కష్టాలు తప్పనిసరి!
కలతలు తొలగిస్తూ
కన్నీరు తుడిపేస్తూ
కరిగి పోతూ సాగిపోయే
కాలం మనకు నేస్తమే!
అనుభవాలు, పాఠాలు
అలుపులేక అందుకుంటూ
అడుగు ముందుకేసే
అలవాటు జీవితాలకు!
ప్రతిరోజుకు నిన్నవుంది
ప్రతి నిన్నకు రేపు వుంది
గడచిన ప్రతి రోజూ
గతమే అవును కదా!
భారాలు భరిస్తూ
దూరాలు చేరిపేస్తూ
భావి స్వప్న గీతికలు
బాట వెంట పాడుతూ...
చేయి కలిపిన నేస్తాలు
మనసు మరువని క్షణాలు
మమత దాచిన కన్నుల
మెరిసిపోయే మెరుపులు
తలపులోన పాతరేసిన
తనివి తీరని సంతోషాలు
తలచుకొని తల్లడిల్లే బాధలు
తరచి చూస్తే కోకొల్లలు!
అనుభవాల మూటలన్ని
అంతరంగాన మోస్తూ
ఆవలి తీరం వైపు
ఆగని పయనమీ జీవితం
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి