సిక్కోలు సభలో తిరుమలరావు రాజ్యాంగం పాట

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు సిక్కోలు పుస్తక మహోత్సవంలో పెక్కు ప్రశంసలు పొందారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో పదిరోజులపాటు నిర్వహిస్తున్న సిక్కోలు పుస్తక మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు కార్యక్రమానికి ఆహ్వానం పొందిన తిరుమలరావు, భావితరాల అంతరంగం భారత రాజ్యాంగం అనే కవితను పాట రూపంలో వినిపించి సభను రంజింపజేసారు. జిల్లాకు చెందిన సాహితీవేత్తలు, సాహితీ సంస్థల ప్రతినిధులు ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక సాహితీ ప్రక్రియల ప్రతిభా ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవి, గాయకులు, చిత్రకారులు, నటులు ఐన కుదమ తిరుమలరావుకు కాళీపట్నం రామారావు సాహిత్య వేదికపై కవితాగానం వినిపించుట విశేషం. ప్రముఖ సాహితీవేత్తలు కంచరాన భుజంగరావు, చింతాడ తిరుమలరావు, డా.కనుగుల సుధీర్, ఎల్.ఎన్.కొల్లి, పక్కి రవీంద్రనాథ్, భోగెల ఉమామహేశ్వరరావు, తంగి ఎర్రమ్మ, కుత్తుమ వినోద్, ఆనెం భాస్కరరావు, వి.రాజారావు తదితర వందలాది మంది సమక్షంలో తిరుమలరావు ఈ గీతాన్ని ఆలపించి అభినందనలు పొందారు.
కామెంట్‌లు