అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి పెద్ద లోటు: అన్నవరం దేవేందర్ -కవి రచయిత -దాశరధి పురస్కార గ్రహీత.
 అందెశ్రీ అచ్చమైన జానపద  సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన వాగ్గేయకారుడు. బడిలో అక్షరాన్ని అవాహన చేసుకోకున్నా ,సహజ ప్రాకృతిక విద్యా సంపన్నుడు. పద్యం పాట కవిత్వం అనియతంగా  నేర్చుకున్నారు . సుతారి పనితో మొదలై ఆధ్యాత్మిక అస్తిత్వవాద చింతనాపరుడై తెలంగాణ  పాటను ప్రపంచ స్థాయి చేశాడు. జయ జయహే తెలంగాణ పాట తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగింది. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంగా గౌరవం దక్కించుకున్నది. అందెశ్రీ ప్రపంచంలోనీ నదులన్నీ స్వయంగా చూసి వచ్చి దీర్ఘకావ్యం రాస్తున్న కాలం. అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి పెద్ద లోటు. 

కామెంట్‌లు