మహాభారతంలో మనకుఅంతగా పరిచయం లేని పాత్ర సంజయుడు, మహా కృష్ణ భక్తుడు న్యాయంకోసం పోరాడిన పురుషోత్తముడు.ధృతరాష్ట్రుని మంత్రిగా నిర్భయంగా పచ్చినిజాల్ని కుండబద్దలు కొట్టిన మహానుభావుడు.దుర్యోధనుని అత్యాచారాల్ని ఖండించిన, ధృతరాష్ట్రుని మందలించిన సాహసి.ధృతరాష్ట్రుడు కిమ్మనేవాడుకాదు.నీవు చెప్పేది నిజమే సంజయా " అని నిస్సహాయత ప్రకటించాడు.కౌరవులపక్షాన సంజయుడు రాయబారిగా వెళ్లి పాండవులను ఒప్పించే ప్రయత్నం చేశాడు.శ్రీకృష్ణార్జునులు అంతఃపురంలో ఉన్నప్పుడు వారిదగ్గరకు సరాసరి వెళ్లిన వాడు సంజయుడు ఒక్కడే.కృష్ణుడు తన రెండుపాదాలు అర్జునుడి ఒడిలో పెట్టుకున్నాడని ధృతరాష్ట్రునికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పిన సంజయుడి చరిత్ర అద్భుతం. వేదవ్యాసుని కృపతో అతనికి దివ్యదృష్టి కల్గటం,కురుక్షేత్ర యుద్ధాన్ని స్వయంగా చూస్తున్న ఆయన ప్రతిదీ వర్ణనచేస్తూ అంధుడైన ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. టి.వి.లో కామెంటరీ వింటూ ఆటచూస్తాంకదా మనం! అలా కొన్ని కోసుల దూరంలో ఉన్న యుద్ధభూమి వారిపోరాటంఅంతా వివరించాడు.కృష్ణుని విశ్వరూపం గీతోపదేశం కూడా కళ్లారా చూడగలిగిన భాగ్యశాలి సంజయుడు.యుద్ధం ముగిశాక గాంధారి ధృతరాష్ట్రులతో వనవాసం చేశాడు.దావాగ్నిలో వారు మరణించిన తర్వాత సంజయుడు మహర్షులకు ఆవార్త అందజేసి హిమాలయాలవైపు వెళ్లాడు.సంజయుని దైవ భక్తి,నిజం మాట్లాడటం,నిర్భయత్వం అందరం తెల్సుకునితీరాలి సుమా🌷
సంజయుడు! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి