అంశము: "జీవితము-సందేశము..
నమోస్తుతే వ్యాసవిశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర'/
యేనత్వయా భారతతైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్ర దీపః//
మనిషికి జీవితంలో సందేహాలు కలగడం సహజం. "సందేహం "వస్తే ముందుకు వెళ్లడం కష్టం. వెళ్లలేము కూడా. అనుమానం పెనుభూతం అన్న నానుడి ఉందిగా. సందేహ నివృత్తి అత్యవసరం. దానికి గాను సత్పురుషుల సద్గ్రంథాల ద్వారా సందేశాలు తెలిసికొని ఆచరించడం ఉత్తమమైన మార్గం.
"రామాయణం"(రాముడు నడిచిన మార్గం). "భారతం"విదుర నీతి, మహాత్మా గాంధీజీ ఆత్మకథ, రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు, వివేకానందుని ఉపన్యాసాలు, భగవాన్ రమణులఉపదేశ సారం,... వంటి గ్రంథాలు మనకెంతో ఉపకరిస్తాయి.
భగవద్గీతలో భగవానుడు అర్జునుడికి బోధ చేస్తూ "సంశయం", ఏమాత్రం కూడదంటూ సంశ యాత్మునకు ఈ లోకము నందు గాని, పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు అని స్పష్టం చేశాడు. సంశయం నివారించుకుంటూ, సందేశం ఆలకించి, ఆచరణలో పెట్టడం మన బాధ్యత.
భగవానుడు పార్ధునకు చెప్పిన కొన్ని సందేశాలు....
మనిషికి బాల్యము, కౌమారము ,యవ్వనము, వార్ధక్యము ,ఉన్నట్లే మరి యొకజన్మ ఉన్నది. అందుచేత మనిషికి మరణము గురించి చింతన అవసరం లేదు. మనిషిప్రకృతి నియమాలకు అనుగుణంగా ప్రవర్తించాలి. అంతేకాని కర్తవ్యాలను మరచి ఇంద్రియ సుఖములకు లోలుడైన వాని జీవితం వ్యర్థం. 'అహంకారి'కర్మలకు కర్తను నేనే, అని భావిస్తాడు. కానీ కర్మలన్నీ ప్రకృతి గుణముల ద్వారా జరుగుతాయి. మనిషికి అహంకారము కూడదు.:నేను :అనవచ్చు :నేనే ;అనడం తగనిది. పరమేశ్వర తత్వం ఎరిగిన వాడు జన్మ మృత్యు చక్రము నుండి బయట పడతాడు. మనిషి :కర్మయోగి,
:కావాలి. అంటే కర్మలా చరించుచున్నను వాటి బంధాలలో చిక్కుకోని వాడవ్వాలి.
అంటే లభించిన దానితో సంతుష్టుడు, అసూయ లేని వాడు, హర్ష శోకాది ద్వందాలకు అతీతుడు, సమదృష్టి కలవాడుగా ఉండాలి. జీవించి ఉండగానే కామ క్రోధాల ఉద్వేగములను అదుపులో ఉంచుకోగల సాధకుడే నిజమైన సుఖి,యోగి. సమస్త ప్రాణులకు ఆత్మీయుడు. పరమాత్మ. పరమ ప్రేమ స్వరూపుడు, ఈ విషయం ఎరిగిన భక్తునికి:శాంతి: లభించును. శాంతి జీవిత పరమ లక్ష్యం. శాంతి లేక ఏమేమి ఉన్నా లేనట్లే. శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే. జీవన గమనానికి సార్ధకత శాంతి లభించడం. ఏ ప్రార్థనలో నైనా ముగింపు" ఓం శాంతి శాంతి శాంతిః"అని అలవడినది. అంటే వ్యక్తిత్వం వికసించినది అని అర్థం,
.శాంతము లేక సౌఖ్యము లేదు అని , త్యాగరాజ స్వామి వారి కీర్తన.
నిష్కామ కర్మ ఆచరణ-యోగ ప్రాప్తి . సర్వసంకల్పరాహిత్యం-మోక్షము. సంకల్పం ఉన్నవాళ్ళుసమస్యే, సంకల్పరాహిత్యం చేరుకోవడం అంటే కెరటాల అలజడులు లేని సముద్ర మధ్య భాగంలో ఉండడం. అక్కడ ప్రశాంతత కాక ఇంకేముంటుంది. అది మోక్షం కాక ఏమవుతుంది. అది యే మోక్షం.
ఆ పార్థునికే కాదు పార్ధులమైన మన అందరికీ ఉత్తమ సందేశం. అర్జునా! సమస్త ప్రాణుల హృదయములందు ఉన్న ఆత్మను నేనే. సకల భూతముల , ప్రాణుల, ఆదియు మధ్య, అంతము నేనే. ప్రాణుల సృష్టి ,స్థితి ,లయములకు కారణమునేనే...
మన పుట్టుక, పెరగడం, చనిపోవడంలలో మన ప్రమేయం ఏమియు లేదని తేటతెల్లం చేసే:సందేశం: ఇది. దైవ నిర్ణయం ప్రకారం ఇవి జరుగుతూ ఉంటాయి అని తెలియడం ఎంతో హాయినిచ్చే విషయం.
ఇలా ఎన్నో సందేశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జీవితం గడుపుకోవడం ఎంతో క్షేమకరణం. జీవితంలో భయం ఉండదు నిర్భయంగా సాగిపోతుంది.
భగవద్గీత పఠనం, మననం, అర్థం చేసుకోవడం, ఎంతో మేలు చేస్తుంది. జీవన పోరాటానికి సంసిద్ధులను చేస్తుంది. భగవద్గీత అంటే వృద్ధాప్యం పుస్తకం కాదు. మనిషికి అన్ని దశల్లోనూ మార్గదర్శి. భగవద్గీతమనిషిని సమదర్శిని చేస్తుంది. అన్ని శాస్త్రముల అధ్యయనం వలన కలిగే ప్రయోజనం భగవద్గీతలోనివిషయముల ఆచరణ వలన కలుగుతుంది.
భగవద్గీతా మార్గం-
జీవన సాఫల్యం.
_______
ఈ క్రింది అధ్యాయములలోని శ్లోకముల భావం పైన వ్రాయబడినది.
2-13,3-1నుండి27వ,
శ్లోకంవరకు,4-9,22,:5-14,23,29,;
6-3;10-20;4-40;
_______
శ్రీమద్భగవద్గీత+ వ్యాసములు_3:- డాపి.విఎల్. సుబ్బారావు-విజయనగరం.-9441058797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి