వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
23. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః (షోడశాక్షరీ)
24. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీ రదనచ్ఛదా (షోడశాక్షరీ)
ఇరవైనాల్గవ నామ మంత్రము -
ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీ రదనచ్ఛదాయై నమః
విద్రుమ = పగడము, బింబము= దొండపండు
బింబశ్రీ= దొండపండు శోభ/వెలుగు
న్యక్కారీ=ధిక్కరించు, రదన=దంతములు/పళ్ళు
రదనచ్ఛాద=పెదవి
అప్పుడే సానపట్టబడినటువంటి పగడము వంటి పై పెదవి, పండిన దొండపండు లాగా మెరిసి పోతున్న క్రింది పెదవి నీ కలిగివున్న పరమేశ్వరికి నమస్కారము.
చక్కని పలువరుస తో వున్న ఓ జగద్ధాత్రి! తల్లీ!! నీ చక్కని పలువరుసను దాచి వుంచుతున్న పై, క్రింది పెదవులు, నిరుపమానమైన కాంతితో వెలిగిపోతున్నాయి. కొత్తగా తయారు కాబడిన ఎర్రటి పగడపు కాంతి, నీ పై పెదవి కాంతి ముందు దిగదిడుపు గానే వుంది. చక్కగా మిగల పండిన దొండపండు ఎర్రదనం కూడా, నీ క్రింది పెదవి వెలుగుల ముందు వెల వెల బోతోంది. ఎందుకంటే, పగడమునకు ఎర్ర రంగు కానీ, దొండపండు యొక్క ఎర్రంగు గానీ నీవు ఇచ్చినవే కదా తల్లీ. అందుకే , ఎర్రని ఎర్రదనానికి చిహ్నంగా, నీ రెండు పెదవులూ చూపబడుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన వశిన్యాది వాగ్దేవతలు, త్రిపురసుందరిని "నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీ రదనచ్ఛదా " అని పిలిచి తరించారు.
దేవ దానవుల యుద్ధం జరుగుతున్నది. మహిషాసురుని జయించడం దేవతల వలన అవడం లేదు. అప్పుడు దేవతాసమూహమంతా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు కోరి ప్రార్ధించారు. వారి మొరలను విన్న త్రిమూర్తులు, మహిషాసురుని ఒక స్త్రీ శక్తి మాత్రమే అంతమొందించ గలదు, అని చెప్పారు. అప్పుడు దేవతల అందరీ తేజస్సు ఒక స్త్రీ మూర్తి గా ఏర్పడింది. అలా ఏర్పడిన స్త్రీమూర్తియే శ్రీలలితా త్రిపురసుందరి. ఆ స్త్రీముర్తికి తమ తమ అంగ సంపదను, ఆయుధ సంపత్తిని అందించారు. ఈ క్రమంలోనే సూర్యుని యొక్క తేజస్సు తో, లాలిత్యము, మృదుత్వమూ కలగిన క్రింది పెదవి, కార్తికేయుని (స్కందుని) తేజస్సుతో పై పెదవి ఏర్పడినాయి.
పరమేశ్వరి నిత్య యవ్వనవతి కనుక, సాన తగ్గిన తరువాత పగడపు కాంతి తగ్గినట్టు, బాగా మాగిన దొండపండు కొన్ని రోజుల తరువాత జీవం లేనిది గా అయినట్టు, అమ్మ పెదవుల కాంతి తగ్గదు. అరుణారుణ కాంతులతో నిరంతరం ప్రకాశిస్తూ వుంటాయి.
అంతటి అందమైన అధరములతో, పరమేశ్వరుని చిలిపిగా కవ్వించే పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు,
ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీ రదనచ్ఛదాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి