నీ కనులతో గారడి నీవిక చేస్తూ
నా గుండెలో గుబులే ఇక పుట్టిస్తూ
నాతో ఆటే ఆడుకుంటావా లేక ప్రేమ పాటే పాడకుంటావా చెప్పు
నీ మనసులో మాటను నీవిక విప్పు ఏమంటావు
నా ముద్దుల గుమ్మా ఇస్తానంటావా నీ ముద్దుల చెమ్మ l
నీ రవ్వల గాజుల సవ్వడినే నువు చేస్తూ
నీ మువ్వల మోజులతో నను మురిపిస్తూ
నీ ఎర్రని బుగ్గల సిగ్గులనిక నందిస్తూ
నాతో జల్సా చేస్తావా ఓ నా ముద్దుల గుమ్మా
రుచి చూపించవా నాకు నీ ముద్దుల చెమ్మా !
నీ కొస కొంగుతో నాజూకుగా నన్నే ఇక కొట్టి
నీ పస బిగువతో వివాజుగా నన్నే ఇక చుట్టి
నీ కౌగిలిని కట్నం గా ఇస్తావా నీ కన్నే కొట్టి
నీ గిలి లోగిల్లో నన్ను నీవు ఇక దాచి పెట్టి
ఉంటనే స్పందించు ఓ నా ముద్దుల గుమ్మా
వెంటనే అందించు నీ ముద్దుల ఆ చెమ్మ
ఆశ చూపి రమ్మంటూ మాట ఇస్తావు నీవు
నిరాశతో పొమ్మంటూ మాట తప్పుతావు
ఈ ఆశ నిరాశ ఉచ్చులో పడి నే చస్తున్న
ఏ కోశానానైన నిన్ను నే చేరాలని చూస్తున్నా
ఇక వస్తావా ఓ నా ముద్దుల గుమ్మా
ఇక ఇస్తావా నీ తీయని ముద్దుల చెమ్మ !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి