జాతి నాయకుల పిల్లలం:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి, రచయిత.-సెల్.9491387977 కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
జాతి నాయకుల పిల్లలం
నిజాయితీ గల మల్లెలం
దేశం అంటే మాకెంతో ప్రేమ
ఆ దేశం కై పడతాం శ్రమ !

కులం మతం మాకు లేదు
మోసం ద్వేషం అంటే చేదు
అసత్యాన్ని ఆడనే ఆడము
సత్యాన్ని ఇక వీడనే వీడము !

జాతిపిత మహాత్మా గాంధీజీ
జాతి నేత పండిత నెహ్రూజీ
భారత జాతి విధాతలు వీరు
స్ఫూర్తి ప్రధాతలై నిలిచినారు !

గాంధీజీ అహింస అంటే మాకిష్టం
రాజియై పడతాం దానికి మేం కష్టం 
అష్ట కష్టాలను మేం ఎదుర్కొంటం
మా ఇష్టాలతో ఇక కుదురుకుంటం!

మా జాతి నాయకుల కలుస్తాం
వారే జనజీవన దైవాలని కొలుస్తాం
వారికి మా అండ దండలు అందిస్తాం
కోరి మేం కొండంత అండగా నిలుస్తాం!

సత్య దీక్ష వ్రతాన్ని మేం చేపట్టి
ఛేవ జవం మా గుప్పిట్లో బిగబట్టి
ఆశయ సాధనకు మేం నడుం కట్టి
ముందుకు సాగుతాం ఒట్టు పెట్టి !


కామెంట్‌లు