సాగరమంటే ఓ ఆహ్లదం!:- కోలా సత్యనారాయణ ;-విశాఖపట్నం
సాగరం అంటే ఒక ఆహ్లాదం!
ఆహ్లాద తీరం ఇది నలుగురికి!
ఆటుపోట్లకు ఆలవాల మిది! 
అలల తాకిడిని భరిస్తుంది!
సహనానికి మారుపేరిది! 
మానవ హృదయం విశాలమని... 
పోలుస్తారు సాగరంతో కవులు!
నదులను తనలో చేర్చుకొను...
పొరపొచ్చాలు లేకుండా! 
రత్నాకరం అని బిరుదొందేను! 
ఆల్చిప్పలు ముత్యాలగు ఇచ్చట...
స్వాతి చినుకు తమపై పడగానే! 
రకరకాల చేపల నిలయ మిది! 
తాబేళ్ళు,  పీతలు ఇక్కడే మకాం! 
ఆపదతెచ్చే సీ హార్సులు,
తిమింగలాలు, షార్కులు ఇచ్చటే!
ఓడలు, పడవలు దీనిపై...
స్వేచ్ఛగా తిరుగాడు ఎప్పుడూ! 
రాముడు వారధి నిర్మిస్తుంటే, 
సాయ మందించేను సాగరమే! 
ఇచ్చటి అలల హెచ్చుతగ్గులే... 
మనిషి కష్ట సుఖాలకు దర్పణం! 
సాయం సంధ్యలో... తీరంలో, 
కూర్చుంటే హాయి వర్ణనాతీతం! 
చీకు, చింతలు,  ఆరళ్ళు మరిచి, 
ప్రశాంతంగా సేద తీరేను జనం! 
ఇంతటి మహా సాగరానికి సైతం... 
కష్టాలు ఎన్నో ఉన్నాయండి!
నావికులు వేసే  పలు వ్యర్ధాలు, 
పారవేసే ఆయిల్, గ్రీజులు, 
తెస్తాయి ఉదధికి ముప్పు! 

పారేయొద్దు తీరంలో చెత్తను!
దర్శకుల కది హానికరం! 
ప్రతి మనిషీ శుభ్రత పాటిస్తే...
రక్షించగలం జల వనరులను!! 
కామెంట్‌లు