పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి పర్యవేక్షణలో విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించే ప్రక్రియ చేపట్టామని సంతవురిటి క్లస్టర్ గ్రేండ్ ఎఫ్ ఎల్ ఎన్ బృంద సభ్యులు డొప్ప శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ నిర్దేశాలమేరకు అన్ని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకూ బేస్ లైన్ ఎసెస్ మెంట్ టెస్ట్ లు నిర్వహించుచుండగా, సంతవురిటి క్లస్టర్ పరిధిలో తమ బృందసభ్యులు ఈ పాఠశాలలను సందర్శించుచున్నామని ఆయన తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు అరసాడ రవి, ముల్లు శ్రీనివాసరావు, సంతవురిటి క్లస్టర్ ఛైర్మన్ కాలెపు వెంకటరావుల నిర్దేశాలమేరకు, సి.ఆర్.ఎం.టి. డొప్ప శ్రీనివాసరావు, సి.ఆర్.ఎం.టి. కొంగరాపు పుష్పలత, వమరవల్లి డైట్ విద్యార్ధిణి కేతుబారికి రేణుక, స్థానిక సచివాలయ విద్యా సంక్షేమ కార్యదర్శి ఎస్.రాము టీమ్ సభ్యులుగా ఈ పర్యటనలు జరుగుచున్నాయి. ఒకటోతరగతి నుంచి ఐదోతరగతి వరకూ తెలుగు, ఆంగ్లం, గణితం విషయాలపై ఈ పరీక్షలను నిర్వహించారు. తెలుగు ఇంగ్లీష్ లలో అక్షరాలు పదాలు వాక్యాలు పేరాలను, గణితంలో సంఖ్యాభావన, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలు విద్యార్థులలో ఏమేరకు సామర్ధ్యాలను కలిగియున్నారో పరిశీలించడం జరిగింది. పరీక్షల అనంతరం తగు ఫలితాలను నమోదు చేసామని బృంద సభ్యురాలు డైట్ విద్యార్ధిణి కేతుబారికి రేణుక అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొన్నారు.
విద్యార్ధుల సామర్ధ్యాల పరిశీలన
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి