కొందరు కొన్ని నేర్పితే,
ఇంకొందరు కొన్ని చేర్చారు.
మరికొందరు కొన్ని లాక్కొంటే,
ఎందరో స్ఫూర్తి నింపారు.
అయిన వారందరూ పాఠాలు
బోధిస్తే,
కానివారు ధైర్యం నూరిపోసారు.
అసలెవరో తెలియనివారు
అక్కున చేర్చుకుంటే,
అన్నీ తెలిసిన వారు దూరం పెట్టారు.
దారిన పోతున్న వారు
ఆగి,మరి హితబోధ చేస్తే,
నమ్మిన వారు నట్టేట ముంచారు.
తోడు నడిచిన వారు
తొందరపెడ్తే,
అపరిచితులు సాంత్వన కలిగించారు.
అందరూ అన్నీ నేర్పారు కానీ,
ఒక్కరు కూడా నాతో నిలబడలేదు.
కలబడిన కాలంతో
ఒక్కడినే నడిచాను.
తిరగబడి గెలిచి చూపించాను.
మనసుతో విడిబడి తడబడ్డా,
మనిషినై మెదిలి జీవించాను.
మానవత చెదరకుండా,
మట్టిలో కలిసినా,
జ్ఞాపకమై మనసులో వెలిగాను.
ప్రేమకు దాసోహమై,
బాసకు బందీనయ్యాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి