దుర్యోధనుడు కర్ణుడు, శకునితో ఆలోచించి దృతరాస్ష్ట్రుని వద్దకు వెళ్ళి " తండ్రీ ! కీడు చేసే శత్రువును ఎలాఅయినా చంపడం వివేకమని దేవగురువు బృహస్పతి చెప్పాడు. పాండవులు మనకు శత్రువులు. ఎంత చేసినా మనం వారికి మంచి వాళ్ళము కాదు. మనం వాళ్ళను విడిచి పెట్టి తప్పు చేసాం. పరాక్రమంలో అర్జునుడికి సమానమైన వాడు ఈ లోకంలో లేడు. ఖాండవవన రక్షణకై దేవేంద్రాది దేవతా గణాలన్నీ అర్జునుడితో యుద్ధం చేసి అతడిని గెలవడం సాధ్యం కాదని తెలుసుకుని అర్జునుడి బాణఘాతాలు తిని శాంతించాయి. భీష్మద్రోనాదులు, ఇతర మేటి విలుకాన్డ్రు కలిసి ఒకటై నిలిచినా అర్జునిడిని ఎదిరించలేము. నాకు ప్రతిఇంటిలోనూ గాండీవం ఎక్కుపెట్టిన అర్జునుడే కనిపిస్తున్నాడు. నాకు నగరమంతా అర్జున మయంగా కనిపిస్తున్నది. పూర్వం దండకారణ్యంలో మారీచునకు రాముడంటే ఎలా భయముండేదో అలాగే నాకు అర్జునుడంటే భయంగా వుంది. జూదంలో వారితో కపటంగా ప్రవర్తించాము. ద్రౌపది పరాభావమును వారు సహించరు. వారు సేనలను సమకూర్చుకుని మన మీదకు వస్తారు. అర్జునుడు గాండీవం, భీముడు గదాయుధం, ధర్మరాజ, నకుల సహదేవులు వారి వారి ఆయుధాలు పడితే మనం వారిని గెలవడం సాధ్యం కాదు. కనుక పాండవులను తిరిగి జూదానికి పిలిచి, పండ్రెండు సంవత్సరములు వనవాసం, పదమూదవ సంవత్సరము జనుల మధ్య అజ్ఞాతంగా గడపాలని, ఒకవేళ అజ్ఞాతవాసం భంగం అయితే మరల పండ్రెండు సంవత్సరములు వనవాసం, పదమూదవ సంవత్సరము జనుల మధ్య అజ్ఞాత వాసం చేయాలనే నిబంధనతో జూదం ఆడించి నిర్వాసితులను చెయ్యడం తక్షణ కర్తవ్యం. కావున పాండవులు ఎంతదూరం వెళ్లి వున్నా వారిని వెనుకకు పిలిపించు. వారు నీమాట కాదనరు" అన్నాడు. భీష్మ ద్రోణ కృప అశ్వద్దామ భురిస్రవసు విదుర యుయుత్స వికర్ణుండు మొదలయిన వారు వద్దని వారించారు. "శాంతించిన పాండవులను రెచ్చగొట్టడం ఎందుకు? నామాట విని వంశ నాశనమునకు కారనమౌతున్న దుర్యోధనుడిని వదిలేయ" మని గాంధారి అన్నది. "వంశం నాశనమైన సరే నేను దుర్యోధనుడిని వారించలేను. నా కుమారులు పాండవులతో జూదం ఆదాలిసిందే " అని ధృతరాష్ట్రుడు మరల జూదానికి రమ్మని ప్రాతిగామిని ధర్మరాజు వద్దకు పంపాడు. తండ్రి మాట మీర రాదని, విధిని తప్పించ లేమని, బంగారు జింక అసంభవం అని తెలిసికూడా రాముడు బంగారు లేడి కోసం వెంట బడినట్లు, శకుని మాయ తెలిసి కూడా, జ్ఞాతుల ఆజ్ఞను ప్రతిఘతించ నన్న తన ప్రతిజ్ఞను స్మరించుకుని ధర్మరాజు జూదానికి వచ్చాడు. అందరూ కూర్చున్నారు. శకుని " ధర్మరాజా! దృతరాష్ట్ర మహారాజు మీరు పోగొట్టుకున్న సమస్త సంపదలు రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక అవి జూదంలో పెట్టడం తగదు. ఓడిన వారు వల్కలములు ధరించి కందమూలములు తింటూ పన్నెండేళ్ళు వనవాసం ఒక్క సంవత్సరం అజ్ఞాత వాసం చేయాలి. ఒకవేళ అజ్ఞాతవాసం భంగం అయితే మరల పండ్రెండు సంవత్సరములు వనవాసం, పదమూదవ సంవత్సరము జనుల మధ్య అజ్ఞాత వాసం ఇదీ పందెం ఇందుకు మీరు అంగీకరిస్తే జూదం ఆడదాం" అన్నాడు. ధర్మరాజు " సరే " అన్నాడు. జూదం ఆడాడు. ఓడి పోయాడు. పాండవులు దివ్యవస్త్రాలు విసర్జించి అరణ్యానికి పోవడానికి సిద్ధం అయ్యారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి