సామెత -68: అక్కరకు వొడవని అర్థమెందుకు-అవసరానికి రాని సుట్టమెందుకు
****
"అవ్వా!అవ్వా! గీ సంగతి నీ శెవుల బడిందా?ఏందో అవ్వా? ఎవలికి ఎప్పుడేమైద్దో? ఏం రోగాన బడ్తమో తెల్వట్లే. గిట్ల కండ్ల ముందు కలకల్లాడే మణిషి తెల్లారి రోగమో, నొప్పో అని అవత్త పడ్డం,దవాఖాన్ల శెరీకవ్వడం సూత్తున్నం."
ఇంతకీ ఎవలికేమైంది శెల్లె? గంత పరేషానుగున్నవు. అయిన గని శేతిల డబ్బులుంటే ఎంత లావు రోగమైన తగ్గిచ్చే డాటర్లున్నరు. పెద్ద పెద్ద దవాఖానలున్నయి. గుండెలు దీసి గుండెలే పెడ్తున్న రోజులే శెల్లె ఇవ్వి. నువ్వు జెర నిమ్మలంగుండు. అయిరాన పడకు.ఎవలికేమైందో శెప్పు శెల్లే!"
"అవ్వా! గా మునెమ్మొదిన ఎరికె గద.గాళ్ళ పెద్ద కొడుక్కి పేద్ద కంపెన్ల మస్తు పైసలుజ్జోగం వొచ్చిందంట".
"గిది గిప్పటి సంగతి గాదు గదనే శెల్లె.యాణ్ణర్తం నుంచి చేత్తనే ఉండుగా!"
అవునవ్వా! అయితే గాళ్ళ కంపినోళ్ళు అమ్మ నాయినకు ఒంట్లె పరీచ్చలు ఫిరీగ చేయించుకోవచ్చని చెప్పిండ్రంట.గట్ల మునెమ్మొదినెను,అన్నను బలంతం చేత్తే మొన్న ఐతారం పట్నం యిద్దరెల్లి ఒంటి పరీచ్చలు చేయించుకుండ్రంట.గట్ల వొదినె ఒళ్ళు పరీచ్చ చేయించుకున్నప్పుడు రొమ్ముల శిన్న గోలికాయంత గడ్డుందని తేలిందటవ్వా!"
అయ్యో గట్లనా పాపం! గిన్ని రోజులు ఎట్లోపిక పట్టింది శెల్లె? నొప్పి లెవ్వలేదట్నా! ఆనెక్క ఏమైందో శెప్పు.
అందుల ముక్క దీసి పరీచ్చకు పంపిండ్రంట. గా తర్వాత ఆ గడ్డని అక్కడ కోసి తియ్యాలె. లేకుంటె గా గడ్డ ఎండ్రకాయి లెక్క సుట్టుపక్కల్కి పాకుతుందని శెప్పిండ్రంట.గదిన్న మునెమ్మొదిన బెహోషు అయ్యిందట.
గప్పుడు డాకటరు "బయమొద్దు గది ఆప్రేషన్ జేసి తీత్తమని,గందుకు మూల్లచ్చలు కర్సొత్తుందని జెప్పిండ్రంట.
"గింత శిన్న గడ్డకి గంతెట్లైద్ది? గిప్పుడు నొప్పి గిప్పి లేదన్నవ్ గద! ఆప్రీషనొద్దు ఏమొద్దు పా ఎల్దం!" అని ఇంటికి దీసుకొచ్చిండంట.
"గిదేం పాపం పాడువడ్డది శెల్లె!లేక సత్తుండా ఏంది? "అక్కరకి వొడవని సొమ్మెందుకు- అవుసురానికి రాని సుట్టమెందుకు?"కట్టల్తో కాల్చేన్ని డబ్బులున్నయి.తలెంట్రికలంత మందిరి సుట్టపోల్లున్నరు.గిస్మంటి సైమంలనే గద ఆసర పడేది?అయిన కట్టుకున్న పెళ్ళాం కన్నెక్కువనా గా డబ్బులు? ఏమన్నయినంక గవన్ని నెత్తిన గొట్కోనీక 'శీ! ఏం మణిషి? ఏం మణిషి? అన్నైతే ఆనెక్కైండు గని దుమ్ము దులిపొత్త పా!"కోపంగ అంటున్న అవ్వొంక జూస్కుంట.."
" గాయన్న గిస్మంటోడనే అక్కరకొచ్చే సుట్టాలు ఆమడ దూరంల ఉండ్రు అక్కా!"
"గా యన్న ఎస్మంటోడైనా ఆపతి వొచ్చినప్పుడు సొరవ జేస్కొని రావాలె శెల్లె! ఏమోలె గాళ్ళ ముచ్చటి మన్కెందుకు తీ! వొదిన్ని జూసి దైర్నం జెప్పొద్దాం పా! గట్లనే ఆప్రీషన్ గురించి మాట్లాడి అన్నను ఒప్పిద్దం"... "గట్ల యిద్దరు మాట్లాడుకుంట మునెమ్మొదిన ఇంటికెళ్ళిండ్రు.
గదండీ సంగతి! "అక్కరకు వొడవని అర్థమెందుకు-అవసరానికి రాని సుట్టమెందుకు" అంటే గిదే మరి. అక్కరకు రాని డబ్బు- అవసరాలకు ఉపయోగపడని బంధువులు ఉండి కూడా లేనట్లే కదా!"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి