అదృష్ట వంతులు...! : - కోరాడ నరసింహా రావు!
పేదింటి బిడ్డకు అమ్మ ప్రేమ చేయిస్తోంది....టబ్ బాత్ ! 
   పొందే ఆనందంలో ... 
 పేదరికమెక్కడ...!? 

కలిమి-లేమిలు మను షులకే....
  మనసుల కుండవుగా ! 

గోరంత లోనే  కొండంత ఆనందం పొందే అదృష్టం !  పేద వారికే.... 
 అది భాగ్య వంతులు పొం దలేనిది...!! 

ఎంత ఉన్నా... ఏదో లేదనే అసం తృప్తివారిది...! 
 యే కాస్త పొందినా... ఆనందించే తత్వం వీరిది!! 

ఆనందం భోగ, భాగ్యాల లోనా... 
  ప్రేమాను రాగాలలో కదూ 

ఎ న్ను న్నా.... ప్రేమానురాగాల సాటి రాగ లవా...?! 

నిజమైన అదృష్ట వంతులు 
అన్నీ వుండి ప్రేమాను రాగాలు లేని వారా....! 
 భోగ, భాగ్యా లేవీ లేకపోయిన... 
అమ్మ ప్రేమాను రాగాలు పొందే వీ రా...!! 
  అదృష్ట వంతు లెవరు!? 
        *****

కామెంట్‌లు