పైరుపచ్చగానుండ
పండ్లుదండిగపండ
నదులుదండిగ
నిండ
జనులు హాయిగా నుండ
లవణ జనములు ద్రావి
మధుర రసముగా మార్చి
మా కోసగే నీకు మేమేమివ్వగలము
మా రసానాగ్రముననున్న
సరస వచనములు తప్ప
భాస్కరా!రమ్ము భూలోక వాసులకు ఇమ్ము నీ దీవెనల
దివ్యదర్శనమ్ము.
ద్యో వాహినీ లోని చులు చూడు
మరి
భూలోక వాసుల చారు రుచు లేన్నెన్నో వేడ్కతోడ వచ్చి చూడవయ్య.
అంతియే గాక వింతగాఅనుకోకు
భూజనంబులు మెచ్చు
భోజనంబులలోన
చారు రుచిచూడగా
చకితుండ వౌదువు
చారునకు ఆ రుచి తెచ్చునది నీ నెచ్చెలికాడు సముద్రుడే.
అన్ని రుచులను చూడుమా ఆదిమూర్తి.రమ్ము, గైకొనుమయ్యా మా ఆతిథ్యమును ప్రీ తితోడ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి