కుడి ఎడమలు!!-డా ప్రతాప్ కౌటిళ్యా.
మనం మనుషులం కాదు 
మనసులం!!
మనం జంతువులం కాదు 
పక్షులం!!

భూమిపై నివసిస్తాం 
ఆకాశంలో ఎగరాలనుకుంటాం!!

మన ముఖం తప్ప 
అందరం ఒకటే 
ఆఖరికి ఆడ మగ తేడా లేదు!!

మనకు దుఃఖం ఉంది తప్ప 
సంతోషం లేదు! 
మనం దేన్నైనా దోచుకుంటాం 
దాచుకుంటాం!!
మనం ముడుచుకుంటాం 
ఒకర్నోకరం పొడుచుకుంటాం!!

మనం ఆడుకుంటాం 
ఆటలో గెలవాల్సింది ఓడాల్సింది 
ఆటగాళ్లు. మనం కాదు!!?
మన తల నిండా ఉండాల్సింది 
మనుషులు కాదు. మంచి ఆలోచనలు!!

దూరంగా పెరిగిన చెట్లు 
పెరిగి పెరిగి దగ్గరవుతాయి 
గుంపులుగా ఉన్న మనం 
చివరికి జరిగి జరిగి దూరమవుతాం!!

పంచితేనే ప్రపంచం 
కూడబెడితే కుటుంబం. !!

కరిగితే మంచులాగా నిశ్శబ్దంగా కరగాలి 
పెరిగితే మొక్కలాగా నిశ్శబ్దంగా పెరగాలి 
వ్యాపిస్తే గాలిలాగా నిశ్శబ్దంగా వ్యాపించాలి!!
బ్రతికితే మనిషిలాగా కాదు మనసులాగా బ్రతకాలి!!

జతలుగా ఉన్నా-!?
కళ్ళు- కాళ్లు- చేతులు- చెవులకు 
కుడి- ఎడమలుంటాయి.!!!

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు