వస్తుంది వస్తుంది
కొత్త సంవత్సరం వస్తుంది
కోటి వరాలను తెస్తుంది
ఈ కొత్త సంవత్సరంలో...
పొడిచే...
ప్రతి పొద్దు...
నుదుటి కుంకుమలా
అందరినీ మురిపించాలని...
నడిచే...
ప్రతి నిమిషం...
నవ్వే నక్షత్రమై అందరి
జీవితాలలో వెలుగులు విరజిమ్మాలని...
గడిచే...
ప్రతి గంట...
గంగానది నిర్మలత్వాన్ని
అందరి గుండెల్లో నింపాలని...
కన్నకలల్ని కంచికి చేర్చాలని...
ఆశల్ని అమృతంలో ముంచాలని...
ప్రతిరోజు...
రోజాలా విరబూయాలని...
ప్రతి వారం...
పచ్చని హరితహారం కావాలని...
ప్రతినెల...
కరగని కమ్మని కలగా మిగిలిపోవాలని...
అందరికీ ఆ పరమాత్మ
సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలనందించాలని...
చెప్పుకుందాం...చెప్పుకుందాం...
అందరికీ శుభాకాంక్షలు...
నూతన సంవత్సర శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి