లెక్కలు రాకుంటే ఎన్నో చిక్కులు: - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)-సారవకోట

 జీవితం ఓ లెక్కలమయం.
అంకెలుతోనే మనిషికి ముడిపడిఉంది.
గుర్తులు కావవి గుర్తింపులు.
మంచిగా ఉంటేనే నీతో కూడుతారు (ప్లస్ +)..
లేకుంటే నిన్ను తీసివేస్తారు (మైనస్ -).
మేలు చేస్తే నీ కీర్తి హెచ్చింపబడును ( ఇంటూ x).
హాని చేస్తే క్షీణించబడుదువు (డివైడెడ్ బై /).
జనన సమయమైనా మరణ ఘడియయైనా జాతక లెక్కలు..
ఒక్క ముద్ద తిను నాయనా,  వందేళ్లు బ్రతుకు జీవుడా వరకు అంతా లెక్కలే..
వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, పని, పాట, ఆట ఒకటేంటి ప్రతిదానికీ  లెక్కే..
కొనాలన్నా, అమ్మాలన్నా..
ఇవ్వాలన్నా, పుచ్చుకోవాలన్నా..
రావాలి లెక్కలు, నేర్చుకోవాలి లెక్కలు.
చదువుకున్నా, చదువుకోకున్నా
లెక్కలు రాకుంటే చిక్కులే.. లేకుంటే చూడాలి దిక్కులు.
కామెంట్‌లు