ఓ పల్లెటూరి నా పిల్లా
పట్నానికి రావా మల్లా
పట్టణమంతా చూపిస్తా
పట్టు చీర నీకు ఇప్పిస్తా !
అమ్మ బాబోయ్ బావయ్యో
పట్నానికి నేను రానయ్యో
అక్కడ రౌడీషీటర్లు ఉంటారు
రౌడీజము వారు చేస్తుంటారు !
ఆ రౌడీ షీటర్లే ఇక వస్తే
రౌడీయిజం వారికి చేస్తే
నేనుంటా గా నీ వెంట
నీకే భయము లేదంట !
నీవే రావాలి తప్పక మా ఊరు
నాకు ఉండదు అప్పుడు బేజారు
వచ్చేటప్పుడు తేవాలిక ఓ కారు
ఆ కారులో చేద్దాం మనం షికారు!
అసలే మాది చిన్న పల్లెటూరు
మీరు వస్తేను ఎవరూ కాదనరు
మీకు పంట పొలాలను చూపిస్తా
మా ఇంటి భోజనం కూడా చేపిస్తా!
మీ ఇంటి వంట నే తింటా
నీ వెంటే నేను ఇక ఉంటా
మీ అమ్మానాన్నల మెప్పిస్తా
మా అమ్మానాన్నల రప్పిస్తా !
మీ అమ్మానాన్నలు మా అమ్మానాన్నలు
మాటా మంతి వారు కలుపుకుంటరు
కోటా వాటా ఇక తెలుపుకుంటరు
లగ్గం పెట్టి బంధుత్వం నిలుపుకుంటరు !
అబ్బా ఎందుకా పట్నం మీరు వచ్చేది
మీ అబ్బ మాకు ఎదురు కట్నం ఇచ్చేది
ఏది ఏమైనా మనకు కుదిరిందిలే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి