సావిత్రి బాయి పూలే: - ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే 
 భారతదేశాన తొలి మహిళా ఉపాధ్యాయురాలై
 భారత మహిళలకు చదువు పంచిన మహనీయురాలు 
సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే 

 చిన్న వయసులోనే జ్యోతిరావు పూలేతో వివాహము 
 నిరక్షరాసురాలైన సావిత్రికి
 ఇంట్లోనే అక్షర జ్ఞానం పంచిన భర్త జ్యోతిరావు పూలే 
 నిమ్న వర్గాల అభ్యున్నతికై 
 కులమత భేదాలకతీతంగా 
 మహిళల హక్కుల కోసం పోరాడసాగింది సావిత్రిబాయి పూలే


సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే 
 భారతదేశాన తొలి మహిళా ఉపాధ్యాయురాలై
 భారత మహిళలకు చదువు పంచిన మహనీయురాలు 
సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే 


 అగ్రవర్ణాలకు ఎదురేగి
 పూణేలో మొదటి బాలికల పాఠశాల స్థాపించి 
 ఎన్నో అవమానాలు ఎదురైనా 
 బురద మట్టితో దాడి జరిగినా
 బురద చీరతో బడికి వెళ్ళుతూ
 బట్టలు మార్చుకుని బడిలో బాలికలకు విద్యనేర్పి
 తిరిగి బురద చీరలో ఇంటి దారి పట్టి
 బాలికల విద్యకై మడమ తిప్పని దీశాలి సావిత్రిబాయి పూలే 

సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే 
 భారతదేశాన తొలి మహిళా ఉపాధ్యాయురాలై
 భారత మహిళలకు చదువు పంచిన మహనీయురాలు 
సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే 


 దళితులు స్త్రీ విద్య కొరకు పాటుపడుతూ 
 యాబై రెండు పాఠశాలలు స్థాపించి
 మహిళా లోకాన అక్షరదీప్తి సావిత్రి 
 మహిళా సేవా మండల్ స్థాపించి 
 మూఢనమ్మకాలు సతీసహగమనం బాల్య వివాహాలపై పోరాటం చేసి
 సత్యశోధక్ సమాజం ద్వారా
 సమాజ చైతన్యం చేసిన వీరనారి సావిత్రిబాయి పూలే 

సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే 
 భారతదేశాన తొలి మహిళా ఉపాధ్యాయురాలై
 భారత మహిళలకు చదువు పంచిన మహనీయురాలు 
సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే 


 బాలికల అక్షరాస్యత కొరకు బీజం పోసి
 తొలి మహిళా ఉపాధ్యాయులుగా పేరుగాంచి
 సమ సమాజ స్థాపనకై పాటుపడిన
 సావిత్రిబాయి పూలే జయంతి 
 తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవమై సాకారం
 మహిళాలోక చైతన్యానికి శ్రీకారం

 సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే 
 భారతదేశాన తొలి మహిళా ఉపాధ్యాయురాలై
 భారత మహిళలకు చదువు పంచిన మహనీయురాలు 
సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే




కామెంట్‌లు