పాల బుగ్గల పసిపాపా
నేల మీద పాకుతూ
కిలకిలా నవ్వుతూ
తల్లి ఒడి చేరి నీవు !!
అమ్మ పాడే జోల పాట
నిమ్మలంగా వినుకుంటూ
చెమ్మగిల్లిన నీ కళ్ళను
గమ్మున మూయమ్మా !!
ముద్దులొలికే పాపాయి
మెల్లిగా నిద్ర పోవమ్మా
పచ్చరము అమ్మ కప్పి
వెచ్చగా నిన్ను బజ్జో పెట్టి!!
ఊరు వాడ తిరిగివచ్చి
బొజ్జ నిండా పాలు తాపి
అత్తా అని చెప్పుతూ
అ అక్షరం నేర్పుతుంది !!
అమ్మ ఒడి తొలి బడి
అమ్మ నేర్పే మాటలు
తెలుగక్షరాల మూటలు
బ్రతుకుదారి బాటలు!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి