సుప్రభాత కవిత : - బృంద
చీకటితో స్నేహం చేసి 
చింతలకు సెలవిచ్చి 
రాతిరితో చేతులు కలిపి 
కలలెన్నో  కన్నుల నింపి

మౌనంతో  వాదించి
మనసును కుదుటపరచి
కాలంతో సహగమించి
కలతలను మరచి...

మలుపుల కుదుపుల్లో
మజిలీలలో  రాజీలతో 
ఘర్షణలన్నీ గమనంలో 
స్పర్షించే అనుభవాలై...

గాయాలను గమనించి 
ఆయాసం అధిగమించి 
మోయాల్సిన భారాలతో
అడుగులు సాగించి...

ఒంటరి భావన కలిగిన
వెంటనే తలపుల వాకిట 
ఊగే జ్ఞాపకాలతో ఊసులాడి 
ఉత్సాహం ఉప్పొంగించి..

కనుల ముందు తోచే 
కమ్మని గమ్యపు మెరుపును 
గమనంతో చేరగా తలచి 
కనువిందుగా తోచే తొలిసంధ్యకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు