చాపర్ల సమాధులు: -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 లోహవిహంగాల మాటున
గాలిలో ప్రాణాలు
రివ్వున ఎగిరే విమానాల
కాక్ పిట్లో ఏమి రహస్యాలో?
బ్లాక్ బాక్సులో శ్వేతపత్రం
రన్ వే లో ఆగని వేగం
అస్పష్టమైన ఉదయంలో
ఆకారాల గల్లంతు
కాలిబూడిదైపోవడమే కన్పిస్తుంటే,
అగమ్య గోచరమైన నిజం
తనువులు నల్లసిందూరాలై
ఆకాశపు అనంత చిహ్నాలై
అమరిక ఆనవాళ్ళు ఇసుమంతై
హాహాకారాలు ప్రాణాలను
ఎగరేసుకుపోతున్నాయి.
సాంకేతిక లోపాలా?
మానవతప్పిదాలా?
ప్రకృతి వికృతులా?
ఏదో తెలియని గాలిమోటరుల గారడీ
అల్పాయుష్షులను పోస్తున్నది.
రోదనల నిశ్శబ్దాలు దహించివేస్తున్నాయి.
అనంతమైన వేదనలను మిగులుస్తున్నాయి.
కాలుతున్న కట్టెలను
చిరునామాలుగా చూపిస్తున్నాయి.
జీవితం క్షణభంగురమన్న సత్యాలు ఋజువులవుతున్నాయి.
ప్రారబ్దకర్మలు చుట్టుముట్టుతున్నాయి.
అదృశ్యపు శక్తులేవో ఆవాహన జరుపుకుంటున్నాయి.
కామెంట్‌లు