రామసింహకవికి గుడి : - కూకట్ల తిరుపతి- రాష్ట్ర ఉపాధ్యక్షులు-తెలంగాణ రచయితల వేదిక
 రామసింహకవి (1857-1963) గ్రామీణ, వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆనాటి పండితులకు దీటుగా పద్యకృతులను రచించి సాహితీపోషకులచే అనేక సత్కారాలు అందుకున్న ప్రతిభాశాలి. ఆయన శతకాలు, కీర్తనలతో పండితపామర జనులను అలరింపజేసిన ధీశాలి. రామసింహకవి సాహిత్యధారకు ముగ్ధులైన అభిమానులు ఆయనకు రాఘవపట్నంలో గుడి కట్టి ఆరాధించారు. ఇది సాహిత్య చరిత్రలో అరుదైన సంఘటన. 
2019లో రామసింహకవి గుడిని కూలదోశారు. ఆయన నివెత్తు విగ్రహాన్ని ముక్కలు జేశారు. ఇంతటి ఘనమైన చరిత్రను ధ్వంసం చేసుకున్నారు. ఈ దుర్ఘటనను తెలంగాణ రచయితల వేదిక ఖండించింది. రామసింహకవి ఊరును సందర్శించింది. ఇలా చారిత్రక ఆనవాళ్లను చెరిపేసుకోవడం ముర్ఖత్వమని గ్రామస్థులను చైతన్యపరచింది. యథావిధిగా  రామసింహకవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటామని గ్రామస్థులు మాట ఇచ్చారు. కానీ ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. ముక్కలైన రామసింహకవి ప్రతిమ ఇంకా గ్రామపంచాయతీ ఆవరణంలోనే ఇలా పడి ఉన్నది.


కామెంట్‌లు