ముక్కొక్కటే ఉంది మీకు
ఒక్కొక్క పుల్లతెచ్చి, చెక్కిన శిల్పంలా చక్కని గూడు
ఎంచక్కా కట్టారమ్మా పక్ష్యమ్మా!
భార్య భర్త తప్పరు మీ బాధ్యత.
గుడ్లు పొదిగే విద్య
ఆద్యంతం అద్భుతం.
పిల్లలు పెద్దలై
మీ ఇద్దరికి గుడ్‌బై
చెప్పి వెళ్ళినా
కోపం ఎరుగని
శాంతమూర్తులు.
క్రమశిక్షణ రక్షింపబడుతోంది మీ దినచర్యలో.మీ సమక్షంలో మా మానవులం
శిక్షణ పొందితే మాకు కొంతైనా అలవడునేమో క్రమశిక్షణ.
డిటాచ్మెంట్ అటాచ్మెంట్ అన్న పదాలకు అద్భుతమైన నిదర్శనాలు మీరు.
మీ ధర్మం తప్పరు, ఎదుటివారికి నీతులు చెప్పరు.
పిల్లలకు తల్లి తండ్రి ఎంతవరకు అవసరమో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.
ఒక్కమాట
నిజంగా నాలో ఉన్న లోపాలన్నీ మిమ్మల్ని చూసి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
మీరు మా మానవులకు గురువులు. మానసిక బరువులు లేని మహా జ్ఞానులు.
తిక్కన భారతం లో మీ జాతి త్యాగనిరతిని చాటిన కథ నా మనసుకు జ్ఞానసుధ.
పక్షీంద్రా!
నీ కుక్షికి ఆహారంతో తృప్తి పొందే నీవు వాల్మీకివ్యాసాది
సాధుజనుల సహోదరుడవయ్యా.
శబరి ఆత్మీయ నెచ్చెలి మీకు
ఓ పక్షీశ్వరీ!
ప్రకృతి పంట పక్షుల సంతతి.
నాకు అందనంత ఎత్తున నున్న పక్షీ శ్వరులకు అర్పింతు శిరస్సు వంచి నమస్సుమాంజలు. 🙏🏼🙏🏼🙏🏼🦜🦆🦇🦅🦜

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి