నల్లగొండ జిల్లా స్థాయిలో శుక్రవారం నిర్వహించిన ఆంగ్లం ఒలింపియాడ్ ట్యాలెంట్ టెస్ట్ కాంపిటీషన్ లో శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు పాల్గొన్నారు,
ఈ కాంపిటీషన్ లో 8 వ తరగతి విద్యార్ధి దర్శిష్ భార్గవ్ నల్లగొండ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి ఆంగ్లం ఒలింపియాడ్ ట్యాలెంట్ టెస్ట్ కు ఎంపిక కావడం జరిగింది, ఈ సందర్భంగా దర్శిష్ భార్గవ్ ను వల్లాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు మరియు ఆంగ్ల గైడ్ ఉపాధ్యాయులు చిత్తలూరి సత్యనారాయణ తోపాటు ఇతర ఆంగ్ల ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థికి అభినందనలు తెలియజేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి