మనదేశాన్ని పాలించిన ఎన్నో రాజవంశాల్లో గుప్త సామ్రాజ్యం అన్నివిధాల స్వర్ణ యుగంగా భాసిల్లింది. హరిషేణుడు సంస్కృతంలో రాసిన సముద్రగుప్తుని విశేషాలు రాతిస్థంభంపై చెక్కబడ్డాయి.కౌశాంబిలో ఉన్నది ఆస్థంభం. ఇది అలహాబాద్ కి 40కి.మీ.దూరంలో ఉంది.సముద్ర గుప్తుడు క్రీ.శ.335_375 దాకా పాలించాడు.రామగుప్తుడు క్రీ.శ.376_382 దాకా,చంద్రగుప్తవిక్రమాదిత్యుడు380_412 దాకా పాలించినట్లు చరిత్ర చెప్తోంది.
చంద్రగుప్త మహారాజు తాత శ్రీగుప్తుడు ఒక చిన్న రాజ్యాన్ని నెలకొల్పాడు.తండ్రి ఘటోత్కచ గుప్తుడు రాజ్యాన్ని పెద్దగా విస్తరించలేక పోయాడు.కానీ ఉన్న ప్రాంతాన్ని భద్రంగా కాపాడాడు.కొడుకు చంద్రగుప్తునికి లిచ్ఛవీరాకుమారి
కుమారదేవితో పెళ్లి చేసి ఆరెండు రాజ్యాల మధ్య మైత్రిని పెంచాడు. అలా గుప్తరాజ్యం బలంగా ఉంది.
ఆకాలంలో అన్నీ చిన్న చిన్న గణరాజ్యాలే! లిచ్ఛవీ గణరాజ్యంలో ప్రస్తుత వైశాలి,మిర్జాపూర్,గాజీపుర్, ఛప్రా, ముజ్ఫర్ పూర్,షాహబాద్ దర్భంగా..ఇలా దాదాపు ఉత్తర బిహారంతా ఉన్నాయి.అల్లుడైన చంద్ర గుప్తునికి ఈప్రాంతం ఇచ్చేశాడు లిచ్ఛవీ రాజు.తనకు ఎలాగూ మగసంతానం లేదు కాబట్టి.
ఆకాలంలో వైశాలి మద్ర మధుర మాలవా స్వతంత్రంగా ఉన్నా కలహాలలో మునిగి తేలేవి.ఈఅనైక్యతే మనదేశం పరాయిపాలనలో మగ్గటానికి దారి తీసింది.కైబర్ బోలన్ కనుమల గుండా శకులు మన భారత దేశంలోకి ప్రవేశించి ముల్తాన్ సింధు జయించి గుజరాత్ కాఠియా వాడ్ వైపు పురోగమించారు. చంద్రగుప్తుడు మహారాజాధిరాజా బిరుదుపొంది రాజ్యాన్ని సురక్షితంగా కాపాడాడు.ఆలయాలు పూజా పునస్కారాల్తో కళకళలాడాయి. ప్రజలు స్వేచ్ఛగా యాత్రలు చేసేవారు.గురుకులాల్లో విద్యార్థులు చక్కగా శాస్త్రాధ్యయనం చేసేవారు,అన్ని రంగాల్లో ఆరితేరిన జనాలతో గుప్త సామ్రాజ్యం అలరారింది🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి