వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
39.కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా (షోడశాక్షరీ)
40.మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా (షోడశాక్షరీ)
నలభైయవ నామ మంత్రము -
ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః
మాణిక్య కిరీటము వంటి ఆకారము కలిగిన మోకాలు చిప్పలజంట తో విరాజిల్లుతున్న జగన్మాతకు నమస్కారము.
అమ్మవారి శరీర నిర్మాణంలో అన్ని శరీర భాగాలు సకలదేవతల అంశతో ఏర్పడినవే. అమ్మవారి ప్రతీ శరీర భాగానికీ ఒక ప్రత్యేకత వుంది. ఒక పెద్దమణిని తీసుకుని తయారు చేయబడినవిగా అమ్మ మోకాలి చిప్పలు దర్శనమిస్తున్నాయి. చక్కని గుండ్రటి సుడులు కూడా కలిగి వున్నాయి, అమ్మ మోకాలి చిప్పలు.
పరమ పతివ్రత అయిన శ్రీమాత, సర్వంసహా మహారాజ్ని, సర్వ లోకాలకూ మాత. శ్రీ మత్సింహాసనేళ్వరి. అయినా కూడా, తన పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి, తన భర్త అయిన భక్తవశంకురునికి, మోకాలిపై కూర్చుని పాదాభివందనాలు చేసింది. ఇలా, మోకాలిపై కూర్చుని పాదాభివందనాలు చేయడం వలన అమ్మ మోకాలి చిప్పలు, కఠినమైన మణులలాగా తయారు అయ్యాయి.
సర్వ జగద్రక్షకి అయిన శ్రీమాత, పాతివ్రత్య ధర్మాన్ని పాటించి, అనుసరించడంలో, చరాచర జగత్తు లోని స్త్రీలు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఉత్తములు అయిన వారు, ధర్మాన్ని వారు ఆచరించడం ద్వారా ఎదుటి వారికి బోధ చేస్తారు.
ఈ విధంగా కఠినమైన మణులలాగా తయారు అయిన అమ్మ మోకాలి చిప్పలను చూసి, వశిన్యాది వాగ్దేవతలు అమ్మను వర్ణించేడప్పుడు "మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా" అని కీర్తించారు.
తాను అనుసరించిన పాతివ్రత్యం తో జగత్తుకు ఆదర్శంగా నిలిచి, అనుగ్రహిస్తున్న లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి