స్వీయ ప్రేరణ -(అంతఃచేతనత్వం) : - అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగామ -9640748497
మనల్ని మనం మార్చుకోనంత కాలం ఇతరుల ఆనందంలో పాలుపంచుకోవడమే

సినిమా నటులు, క్రికెట్ స్టార్స్
వారు వారి వృత్తి ధర్మాన్ని 
సక్రమంగా నిర్వర్తిస్తూ 
కోటానుకోట్ల అభిమాన గణాన్ని సొంతం చేసుకుంటున్నారు 

మనమింకా భక్తి ఉన్మాదంతో

స్వీయ ప్రేరణ పొందక
దేవుడిపై భారం వేసి 
బ్రతుకెళ్ళదీస్తున్నాం

నేనెవరో చరిత్ర చదివే కంటే
నేనే ఓచరిత్రనుసృష్టించలేనా!?
అనే భావన మనలో జనించిన నాడు
ప్రతీ ఒక్కరు ఒక ఐనిస్టీన్,
మార్క్ జూకర్ బర్గ్ 
ఓ కిరణ్ బేడీ 
సుందర్ పిచాయ్
ఓ విరాట్ కోహ్లీ 
ప్రయత్నమే లేకుండా ముక్కు మూసుకొని తపస్సు చేయకు
ఏది తానంతంటతానుగా 
నీదరికిరాదు శోధించిసాధించాలన్నది మరువొద్దు
కామెంట్‌లు