ప్రేమంటే వయసులో ఉన్నఆడ మగ మధ్య మాత్రమే పుట్టేది కాదు..ఈ రెండక్షరాల ప్రేమ అభివర్ణించలేని అనిర్వచనీయ విశ్వ భావన..అనుభూతి చెందితే తప్ప అనుభవంలోకి రాని మనసు పడే మధుర వేదన..ఈ లోకంలో అనంతమైన ప్రేమ అమ్మానాన్నలది..అపురూపమైన ప్రేమ ఆలుమగలది..అరుదైన ప్రేమ పిల్లలది..ప్రతి బంధం లో ప్రేమ, అనుబంధం ప్రేమ..తరచి చూస్తే ప్రకృతిలోనిప్రతి అణువణువులో ఉంది తన చిరునామా.. ప్రేమే సత్యం ప్రేమే నిత్యం..ప్రపంచానికి ప్రేమే ప్రాణం.. ప్రేమ దైవ స్వరూపం..అలాంటి ప్రేమరెండు శరీరాల ఆరాటం మాత్రమే కాదు రెండు హృదయాల ఆరాధనప్రేమంటే దేహాల దాహా లు తీర్చుకునే దారి కాదు..రెండు దేహాలకి ఒక్కటే ప్రాణమయ్యే ఊపిరిప్రేమంటే ఒక్కోసారి పొందడమే కాదుపోగొట్టుకోవడం కూడా..దెగ్గరవ్వడమే కాదుదూరమవ్వడం కూడా..ఓడినా గెలిచినా ఒకేలా ఉండాలి..దూరమున్నా దగ్గరైనా ఒకేలా అనిపించాలి..ప్రేమలో గెలవడం అంటే ఇద్దరు ఒక్కటవ్వటమే కాదుఒకరికొకరై బ్రతకాలి..ఒక వేళవిడిపోయినా ఆ ఎడబాటును కూడాఅంతే ప్రేమగా భరించగలగాలి..అసలింతకీ ప్రేమకు ఈ ప్రేమ అనే పేరుఎవరు పెట్టారో తెలియదు గానీ..ఈ ప్రేమకు పరమార్థం మాత్రంచంపడమో లేక చావడమో కాదు బ్రతకడం..బ్రతికించడం.
ప్రేమంటే ఇదేరా!: - నాగవేణి చాగర్లమూడి-చరవాణి: 9908159215
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి