మాస్టారు మాటలు: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
తృప్తిలేని జీవితము
తలపించును నరకము
ఎంత ఉన్నా శూన్యము
అక్షరాలది సత్యము

కోపంలో నిర్ణయము
ఇస్తుంది దుష్పలితము
శాంతంగా యోచిస్తే
దొరుకునోయ్! పరిష్కారము

జీవితము అతిచిన్నది
మలచుకో ఉన్నతంగా
మన చేతుల్లో ఉన్నది
చేసుకో అద్భుతంగా

గడిచిపోతే సమయము
కఠినమైతే హృదయము
పొంచి ఉండు ప్రమాదము
గుర్తించుకో అనిశము


కామెంట్‌లు