ఛత్రపతి శివాజి:- కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం
హిందూ సామ్రాజ్య స్థాపకుడు- ఛత్రపతి శివాజి(19 ఫిబ్రవరి 1630-  3 ఏప్రిల్ 1680)
................................
జీవితాన మొదట దేశమని
తల్లి తండ్రులు, విద్య నేర్పిన గురువు కి తరువాత ప్రాధాన్యత అని
బానిసత్వం నుంచి దేశాన్ని రక్షించుటే నా కర్తవ్యం అని
హిందుసామ్రాజ్యస్థాపన కే
తన జీవితాన్ని అర్పించిన
ఛత్రపతి శివాజీ సదా స్మరణీయులు......!!

మహారాష్ట్రలో పూణే దరి
షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించిన శివాజీ బాల్యంలో మాతృమూర్తి చెప్పిన రామాయణ,భారత గాధలు ,శిబి, రంతిదేవుల జీవిత చరిత్రలతో ప్రభావితుడై నందున
జిజియాబాయి మొదటిగురువే అని
పరదేవతా గా స్వీకరించిన
మాతృభక్తి పరాయణుడు.!

పదిహేడేండ్ల ప్రాయంలోనే బీజాపూర్ సామ్రాజ్యానికి తోర్నా కోట, రాయఘడ్ కోటలను స్వాధీనము చేసుకుని, తండ్రి ని అన్న శంభాజీ తో కలసి ఖైదునుంచి విడిపించిన వీరపుత్రుడు. పరాక్రమవంతుడైన
అఫజుల్ ఖాన్ తలనరికి
తన ఇష్టదైవమైన భవానీమాత దేవాలయ
వినాశనకారుని హతమార్చిన పరాక్రమ దైవభక్తులు శివాజీ మహరాజ్...!!

యశ్వంతి అను పేరు గల ఉడుము సహాయంతో మంత్రి తానాజీ రాయఘడ్ కోటను ఆక్రమించి వీరమరణం పొందినపుడు
శత్రువును గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నామన్న  స్నేహశీలి శివాజీ....!!

శత్రుసంహరము చేసి వారి అందమైన భార్యని శివాజీకి సైనికాధికారి బహుమతిగా ఇస్తే 
మీ అంత అందమైన తల్లికి
నే జన్మిస్తే ఎంత అందముగా ఉందునో అన్న
శివాజీ స్త్రీ జనోద్ధారకుడు
నిష్కళంక దేశభక్తుడు...!!

పరమత సహనానికి ప్రతీకగా ఆయుధ విభాగాధిపతి హైదర్ ఆలీఖాన్ ను,నావికాదళానికి ఇబ్రహీంఖాన్ ను,సర్వ సైన్యాధ్యక్షునిగా దౌలత్ ఖాన్ ను నియమించిన
రాజనీతిజ్ఞులు శివాజీ
మీకివే మా శతకోటి భారతీయుల వందనములు....!!
............................


కామెంట్‌లు