1890లో విన్సెంట్ వాంగో కేవలం 37 సంవత్సరాల వయసులో మరణించినప్పుడు, ఆయన చిత్రాలు విలువైనవిగా ఎవరూ గుర్తించలేదు. ఎవరూ వాటిని కొనడానికి ఇష్టపడలేదు. ఆయన వైఫల్యాలతో నిండిన జీవితాన్ని, ఒక నిరాడంబరమైన గదిని, వందలాది అమ్ముడుపోని కాన్వాసులను విడిచిపెట్టి పోయారు.
ఆరు నెలల తరువాత, ఆయన సోదరుడు, ఆ ప్రతిభను నమ్మిన ఏకైక వ్యక్తి థియో వాంగో. తీరా అతనూ మరణించాడు. దీంతో విన్సెంట్ వాంగో చిత్రకళ ఎవరినీ ఒప్పించలేక విఫలమైన కథగా ముగిసిందనే అనుకున్నారు. ఈ స్థితిలో మిగిలి ఉన్నది ఒక పిల్లవాడు, వందలాది లేఖలు, మార్కెట్ విస్మరించిన కళాత్మక వారసత్వం.
అయితే, వాంగో కళాహృదయాన్ని విధిని 28 ఏళ్ల మహిళ మార్చివేసింది. ఆమె మరెవరో కాదు. విన్సెంట్ వాంగో సోదరుడు థియో భార్య జో వాంగో బొంగర్. ఆమె తన బావగారి పెయింటింగులు, సాహిత్యాన్ని సేకరించే బాధ్యతను తీసుకుంది. దానిని తక్కువ ధరలకు అమ్మే బదులు, వాటిని పరిరక్షించాలని ఆమె భావించింది.
జో ఇద్దరు సోదరుల మధ్య లేఖలతో ప్రారంభించింది. ఆమె వాటిని క్రమబద్ధీకరించి ప్రచురించింది. ఈ క్రమంలో కళాకారుడిని అర్థం చేసుకోవడానికి తోడ్పడే విషయాలు వెల్లడయ్యాయి. బావగారైన వాంగో లక్ష్యం గురించి తెలిసిన లోతైన సృష్టికర్త చిత్రంతో భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టింది. నిరంతర ప్రచారం చేసింది. జో ప్రదర్శనలను నిర్వహించింది, విమర్శకులు, ఆర్ట్ గ్యాలరీల ప్రతినిధులు, మ్యూజియంలను సంప్రతించింది. తన సేకరణను తొందరపడి విక్రయించడానికి నిరాకరించింది. వ్యూహాత్మకంగా ఎక్కడ ఎవరికి రచనలు అందించాలో ఎంచుకున్నాది. మొదటి ప్రధాన ప్రదర్శనలు బెర్లిన్‌లో, తరువాత పారిస్‌లో, తర్వాత నెదర్లాండ్స్‌లో జరిగాయి. పట్టుదలతో చేసిన ఆమె కృషి వల్ల వాంగో ఖ్యాతి క్రమంగా విస్తరించింది.
ఇది ఒక శృంగార ప్రక్రియ కాదు అందరి దృష్టినీ ఆకట్టుకోవడానికి. కానీ జో ప్రయత్నాలు ఫలించాయి. ఆమె వాదనలు, స్థిరమైన కృషికి మంచి స్పందనే లభించింది.
1925లో ఆమె మరణించే సమయానికి, విన్సెంట్ వాంగో ఆధునిక యుగంలో అత్యంత ముఖ్యమైన కళాకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఈనాడు, ఆంస్టర్డాంలోని వాంగో మ్యూజియం ఆ కళాకారుడి ఉనికికి ప్రధాన కేంద్రమైంది. జో ఒక్క చిత్రాన్ని కూడా చిత్రించలేదు. కానీ ఆమె పేరు కళా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పేర్లలో ఒకటిగా నిలిచిపోయింది. ఆమె వల్ల విన్సెంట్ వాంగో కళాప్రపంచంలో అమరుడయ్యాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి